India GDP Growth: రికార్డ్ స్థాయిలో దేశ జీడీపీ.. క్యూ1 లో 20.1 శాతం వృద్ధి
దేశ జీడీపీ రికార్డ్ స్థాయిలో వృద్ధి నమోదు చేసింది. క్యూ1లో 20.1 శాతం వృద్ధి నమోదు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
భారత జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 20.1 శాతం వృద్ధి రేటు సాధించినట్లు కేంద్రం వెల్లడించింది.
Real GDP has strongly bounced back in the first quarter of the Financial Year (FY) 2021-22 with growth rate of 20.1 % as against the contraction of 24.4% witnessed in the Q1 of FY 2020-21: Ministry of Statistics & Programme Implementation pic.twitter.com/DJxkZWI2ZA
— ANI (@ANI) August 31, 2021
గతేడాది ఇదే మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 24.4 శాతంగా ఉంది. ఇప్పుడు 20.1 శాతంతో సానుకూలంగా నమోదైంది.
మరోవైపు, పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్త పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ జులై నెలలో 1.1 పాయింట్లు పెరిగి 122.8కు చేరింది. జూన్ నెలలో ఇది 121.7 పాయింట్లుగా ఉంది.
General inflation for July, 2021 went down to 5.27% compared to 5.57% of the previous month. Food inflation also decreased to 4.91% from 5.61% in the previous month: Ministry of Labour & Employment pic.twitter.com/DqCSE1Rfkw
— ANI (@ANI) August 31, 2021
All-India Consumer Price Index for Industrial Workers for July, 2021 increased by 1.1 points&stood at 122.8. On 1-month %age change, it increased by 0.90% w.r.t previous month compared to increase of 1.20% recorded b/w corresponding months year ago:Ministry of Labour & Employment
— ANI (@ANI) August 31, 2021
ఆహార ద్రవ్యోల్బణం
ఆహార ద్రవ్యోల్బణం కూడా స్వల్పంగా తగ్గి 4.91 శాతానికి చేరుకుంది. 2021 జూన్లో ఆహార ద్రవ్యోల్బణం 5.61 శాతం ఉండగా.. గతేడాది జులైలో 6.38 శాతంగా ఉంది.