News
News
వీడియోలు ఆటలు
X

Forex: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ, 588.78 బిలియన్ డాలర్లకు పెరిగిన విదేశీ మారక నిల్వలు

గత వారం రోజుల్లో విదేశీ మారక నిల్వలు 4.53 బిలియన్ డాలర్లు పెరిగాయి.

FOLLOW US: 
Share:

Iindia's Forex Reserves: భారతదేశ వాణిజ్యానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. భారతదేశ విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయని వెల్లడించింది. ఏప్రిల్ 28, 2023తో ముగిసిన వారంలో, విదేశీ మారక నిల్వలు 588.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2023 ఏప్రిల్ 21తో ముగిసిన అంతకుముందు వారంలో ఈ మొత్తం 584.25 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

వారంలో 4.53 బిలియన్ డాలర్లు పెరిగిన నిల్వలు
RBI విడుదల చేసిన సమాచారం ప్రకారం, గత వారం రోజుల్లో విదేశీ మారక నిల్వలు 4.53 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనికి ముందు వారంలో, అంటే ఏప్రిల్ 21వ తేదీతో ముగిసిన వారంలో భారత్‌ వద్ద ఉన్న ఫారెక్స్‌ నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు క్షీణించాయి. ఆ తర్వాత భారతదేశ ఎగుమతులు మెరుగుపడడంతో దేశంలోకి డాలర్లు తిరిగి వచ్చాయి, ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో నిల్వలు పెరిగాయి. ఏప్రిల్‌ నెలలోని తొలి రెండు వారాల్లో విదేశీ కరెన్సీ నిల్వలు 8 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి.

ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు పెరిగినప్పటికీ, వాటి చారిత్రక గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 57 బిలియన్ డాలర్లు తక్కువలో ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, సమీక్షలో ఉన్న వారంలో, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) 4.99 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 519.48 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు అంటే.. విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. డాలర్ రూపంలో ఈ విలువను చెబుతారు.

ఏప్రిల్ 28, 2023తో ముగిసిన వారంలో బంగారం నిల్వల (Gold reserves) విలువ 0.5 బిలియన్‌ డాలర్లు తగ్గి 45.65 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకుముందు వారంలోనూ బంగారం నిల్వలు 2.4 మిలియన్‌ డాలర్లు తగ్గి 46.15 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సమీక్షలో ఉన్న వారంలో, IMF వద్ద భారత నిల్వలు 5.17 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఈ కారణంగా, విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఉత్పన్నమయిన ప్రపంచ ఉద్రిక్తతలు కూడా మన దేశ ఫారెక్స్‌ రిజర్వ్స్‌పై ప్రభావం చూపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు కొనుగోళ్ల కోసం డాలర్ల రూపంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. 2022లో US ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించడంతో విదేశీ పెట్టుబడిదార్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో, రూపాయి విలువలో బలహీనత కనిపించింది. ఆ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 శాతం పడిపోయి రూ.83 కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయికి మద్దతు ఇవ్వడానికి, ఆర్‌బీఐ డాలర్లను విక్రయించాల్సి వచ్చింది. ఈ కారణంగానూ విదేశీ మారక నిల్వలు క్షీణించాయి.

ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.

Published at : 06 May 2023 12:11 PM (IST) Tags: India RBI Economy Forex reserves Forex dollars

సంబంధిత కథనాలు

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం