News
News
X

Share Lock-in Period: రాహుకాలానికి రెడ్‌ కార్పెట్‌ పరిచిన కంపెనీలివి, ఈ షేర్లు మీ దగ్గరుంటే పారాహుషార్‌!

లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగియగానే యాంకర్ ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు తమ దగ్గరున్న షేర్లను అమ్ముతారా లేదా కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన అంశం.

FOLLOW US: 
 

Share Lock-in Period: నవ తరం (న్యూ ఏజ్‌) కంపెనీలు నవంబర్‌లో కొంప ముంచడానికి సిద్ధంగా ఉన్నాయి. పేటీఎం, నైకా, డెలివెరీ, పీబీ ఫిన్‌టెక్‌ సహా దాదాపు 20 కంపెనీల షేర్లలో అతి భారీ సప్లై ఉండవచ్చు. సప్లై పెరిగిందంటే ఆటోమేటిక్‌గా డిమాండ్‌ తగ్గి, ధర పడిపోతుంది. 

ఈ కంపెనీలన్నీ గత ఏడాది నవంబర్ లేదా ఈ సంవత్సరం మేలో పబ్లిక్‌గా మారాయి. ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్‌ పెట్టుబడిదారులకు (ఐపీవోకు రాకముందు కంపెనీలో పెట్టుబడి పెట్టిన యాంకర్‌ ఇన్వెస్టర్లు) ఈ కంపెనీల లాక్-ఇన్ పిరియడ్‌ నవంబర్‌లో ముగుస్తుంది. ప్రమోటర్లకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి, లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగియగానే యాంకర్ ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు తమ దగ్గరున్న షేర్లను అమ్ముతారా లేదా కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన అంశం.

లాన్‌-ఇన్‌ పిరియడ్‌ అంటే?
స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ నిబంధనల ప్రకారం... ప్రి-ఐపీవో ఇన్వెస్టర్లకు ఐపీవో తేదీ నుంచి ఆరు నెలల పాటు షేర్లకు లాన్‌-ఇన్‌ గడువు ఉంటుంది. ప్రమోటర్లు ఐపీవో తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు కనీసం 20% హోల్డ్‌ చేయాలి. ఈ లాక్‌-ఇన్‌ పిరియడ్‌లో వీళ్ల షేర్లను అమ్మడానికి వీల్లేదు. గడువు ముగిసిన తర్వాత ఆ షేర్లను అమ్ముకోవాలా, అట్టి పెట్టుకోవాలా అన్నది వాళ్లిష్టం. సాధారణంగా, ప్రి-ఐపీవో ఇన్వెస్టర్లు లాక్‌-ఇన్‌ తేదీ ముగియగానే తమ దగ్గరున్న వాటాలను స్టాక్‌ మార్కెట్‌లో డంప్‌ చేసి, సొమ్ము చేసుకుంటారు. ముందు చూపున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు లాక్‌-ఇన్‌ పిరియడ్‌ను ముందే తెలుసుకుని, ఆ గడువుకు కొన్ని రోజుల ముందు నుంచే తమ దగ్గరున్న షేర్లను మార్కెట్‌లో అమ్మకానికి పెడతారు. ఫలితంగా ఈ లాక్‌-ఇన్ గడువుకు ముందు నుంచే సదరు షేర్ల సప్లై పెరుగుతుంది. గడువు నాటి నుంచి ఫ్లో మరింత పెరుగుతుంది. కోట్లాది షేర్లు అమ్మకానికి వస్తాయి కాబట్టి షేరు ధర పడిపోతుంది.

ఒక ఉదాహరణ చూస్తే... ఈ ఏడాది జూలైలో జొమాటో (Zomato) షేర్ల వన్‌ ఇయర్‌ లాక్-ఇన్ వ్యవధి ముగిసింది, ఆ వెంటనే షేరు ధర 22% పడిపోయింది. ఉబెర్, టైగర్ గ్లోబల్‌తో సహా కొన్ని ప్రి-ఐపీవో ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో తమ వాటాలను తగ్గించుకున్నాయి. 

News Reels

ప్రి-ఐపీవో ఇష్యూలో షేర్లు కొన్నవాళ్లు లేదా ప్రమోటర్ల వాటా 20% కంటే ఎక్కువగా ఉంటే...  వాళ్ల లాక్-ఇన్ పిరియడ్‌ను గతంలో ఉన్న ఒక సంవత్సర కాలం నుంచి ఆరు నెలలకు సెబీ తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 

నవంబర్‌లో గడువు ముగుస్తున్న కంపెనీలు
డెలివరీ, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, పారాదీప్ ఫాస్ఫేట్స్, క్యాంపస్ యాక్టివ్‌వేర్‌ సహా 11 కంపెనీల లాక్-ఇన్ పిరియడ్ ఈ నవంబర్‌లో ముగుస్తుంది. అవి... క్యాంపస్ యాక్టివ్‌వేర్‌ - నవంబర్‌ 9న; పేటీఎం, సఫైర్‌ ఫుడ్స్‌ - నవంబర్‌ 18న; నైకా, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ - నవంబర్‌ 10న; ఫినో పేమెంట్స్‌ బ్యాంక్ - నవంబర్‌ -12న; PB ఫిన్‌టెక్ - నవంబర్‌ 15న; డెలివెరీ - నవంబర్‌ 24న; టార్సన్‌ ప్రొడక్ట్స్‌ - నవంబర్‌ 26న; పారాదీప్ ఫాస్ఫేట్స్ - నవంబర్‌ 27న; గో ఫ్యాషన్‌ - నవంబర్‌ 30న లాక్‌-ఇన్స్‌ ముగుస్తాయి. 

నైకా షేర్లు గత నెల రోజుల్లోనే 24% క్షీణించాయి. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పిరియడ్ నవంబర్ 10న ముగుస్తుంది. 67% షేర్ క్యాపిటల్ లేదా దాదాపు 319 మిలియన్ షేర్లు లాక్-ఇన్ ఎక్స్‌పైరీ రోజున ట్రేడ్‌ కోసం వచ్చే అవకాశం ఉంది. పీబీ ఫిన్‌టెక్ షేర్లు ఆఫర్ ప్రైస్‌ నుంచి ఇప్పటికే 61% క్షీణించాయి. దీని వ్యవధి ముగిస్తే, దాదాపు 28 మిలియన్ షేర్లు మార్కెట్‌లోకి వచ్చి పడే ఛాన్స్‌ ఉంది. మిగిలిన కంపెనీలకూ ఇదే వర్తిస్తుంది. కాబట్టి, మీ దగ్గర ఈ కంపెనీల షేర్లు ఉంటే ముందు జాగ్రత్త పడడం మంచిది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 31 Oct 2022 08:12 AM (IST) Tags: Share Market Stock Market Lock-in Period Shares Supply

సంబంధిత కథనాలు

Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

Bajaj Hindusthan Sugar Shares: బాకీలు తీర్చేశాక బరబరా పెరిగిన స్టాక్‌ ఇది, తియ్యటి కబురుతో 43% జంప్‌

Bajaj Hindusthan Sugar Shares: బాకీలు తీర్చేశాక బరబరా పెరిగిన స్టాక్‌ ఇది, తియ్యటి కబురుతో 43% జంప్‌

తీసుకున్న లోన్‌ కట్టలేదని ఫోన్ చేస్తుంటే మీరు కేసు పెట్టొచ్చు!

తీసుకున్న లోన్‌ కట్టలేదని ఫోన్ చేస్తుంటే మీరు కేసు పెట్టొచ్చు!

Tata group stocks: అన్‌లక్కీ 2022, ఈ ఏడాదిని నష్టాలతో ముగించనున్న 8 టాటా గ్రూప్‌ స్టాక్స్‌

Tata group stocks: అన్‌లక్కీ 2022, ఈ ఏడాదిని నష్టాలతో ముగించనున్న 8 టాటా గ్రూప్‌ స్టాక్స్‌

LIC Dhan Varsha: ఒక్క ప్రీమియం కడితే చాలు, 10 రెట్లు రిటర్న్‌ ఇచ్చే ఎల్‌ఐసీ పాలసీ ఇది

LIC Dhan Varsha: ఒక్క ప్రీమియం కడితే చాలు, 10 రెట్లు రిటర్న్‌ ఇచ్చే ఎల్‌ఐసీ పాలసీ ఇది

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?