అన్వేషించండి

PM Surya Ghar: పీఎం సూర్య ఘర్‌ స్కీమ్‌ కింద SBI లోన్‌ - పూర్తి వివరాలు ఇవే!

Pm Surya Ghar Muft Yojana: పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లతో సొంతంగా ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చెయ్యొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి చూస్తే..

PM Surya Ghar Muft Bijli Yojana Loan: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌ "పీఎం సూర్య ఘర్ ముప్త్‌ బిజిలీ యోజన" కింద ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు. తద్వారా, నెలకు 300 యూనిట్ల వరకు కరెంట్‌ను ఉచితంగా వాడుకునే అవకాశం ఉంటుంది. 300 యూనిట్లను మించి మిగిలిన కరెంటును ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించొచ్చు.

పీఎం సూర్య ఘర్ ముప్త్‌ బిజిలీ యోజన రూ.75,021 కోట్లతో 2024 ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడంతో పాటు, కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించడం ఈ స్కీమ్‌ లక్ష్యం. 

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలు కోసం స్టేట్ బ్యాంక్ (SBI) లోన్‌ స్కీమ్‌ ప్రకటించింది. ఈ పథకం కింద సౌర విద్యుత్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేవాళ్లకు రుణం ఇస్తోంది.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వివరాలు:

- రాయితీ: ఈ స్కీమ్ కింద, 1 కిలోవాట్ (kW) సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది.

- తాకట్టు లేని చౌక రుణం: అర్హత గల దరఖాస్తుదార్లు రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ (RTS) సిస్టం ఏర్పాటు చేసుకోవడానికి 7% కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) పొందొచ్చు. 

- గరిష్ట రుణం: 3 kW సామర్థ్యం గల ఇన్‌స్టాలేషన్‌ల కోసం స్టేట్‌ బ్యాంక్‌ గరిష్టంగా రూ. 2 లక్షలు; 3 kW నుంచి 10 kW వరకు ఇన్‌స్టాలేషన్‌ కోసం గరిష్టంగా రూ.6 లక్షల లోన్‌ ఇస్తుంది.

- రుణ కాల వ్యవధి: రుణ కాల వ్యవధి 120 నెలల వరకు ఉంటుంది. లోన్‌ తీసుకున్న తేదీ నుంచి ఆరు నెలల మారటోరియం లభిస్తుంది. అంటే, లోన్‌ తీసుకున్న ఆరు నెలల తర్వాతే లోన్‌ EMI ప్రారంభం అవుతుంది. 

SBI రుణం పొందడానికి అర్హతలు:
లోన్‌ తీసుకునే దరఖాస్తుదారు వయస్సు తప్పనిసరిగా 65 సంవత్సరాల లోపు ఉండాలి. 
680 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌ (CIBIL Score‌) ఉండాలి.
రూఫ్‌టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు కోసం రూఫ్‌టాప్ హక్కులు కలిగి ఉండాలి. 
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పైకప్పుపై తగినంత స్థలం ఉండాలి. 
రూఫ్ ఏరియా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 
దరఖాస్తుదారుకు తప్పనిసరిగా పొదుపు ఖాతా ఉండాలి.

పీఎం సూర్య ఘర్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన పత్రాలు:
ఆధార్ కార్డు
నివాస ధృవీకరణ పత్రం
విద్యుత్ బిల్లు
బ్యాంకు పాస్‌బుక్
పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో
రేషన్ కార్డు
మొబైల్ నంబర్‌
అఫిడవిట్
ఆదాయ ధృవీకరణ పత్రం

లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజనపై ఆసక్తి ఉన్న వ్యక్తులు, SBI లోన్ కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదా, దగ్గరలోని బ్యాంక్‌ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget