అన్వేషించండి

HDFC Bank: కొత్త హైట్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎం-క్యాప్‌, ఇండియన్‌ బ్యాంక్స్‌కు ఈ ఫీట్‌ అసాధ్యం!

మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ చైనా వంటి గ్లోబల్‌ దిగ్గజాల కంటే పెద్దది, ప్రపంచంలోని ఏడో లార్జెస్ట్‌ లెండర్‌.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను తనలో కలిపేసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మరో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ బ్యాంక్‌, ఇవాళ (సోమవారం, 17 జులై 2023) 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఎక్స్‌క్లూజివ్‌ గ్లోబల్‌ క్లబ్‌లోకి అడుగు పెట్టింది. పేరెంట్‌ కంపెనీ రివర్స్‌ మెర్జర్‌ తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేర్‌ హోల్డర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అలాట్‌ అయ్యాయి. ఈ కొత్త షేర్లు లిస్ట్‌ కావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (HDFC bank market capitalisation) పెరిగింది.

సెవెన్త్‌ లార్జెస్ట్‌ లెండర్‌
ప్రస్తుతం, దాదాపు 151 బిలియన్‌ డాలర్లు లేదా రూ. 12.38 లక్షల కోట్ల మార్కెట్ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ట్రేడ్‌ చేస్తోంది. అది ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ చైనా వంటి గ్లోబల్‌ దిగ్గజాల కంటే పెద్దది, ప్రపంచంలోని సెవెన్త్‌ లార్జెస్ట్‌ లెండర్‌. మరే ఇండియన్‌ బ్యాంక్‌కు ఈ ఫీట్‌ సాధ్యం కాకపోవచ్చు!

JP మోర్గాన్ (438 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌), బ్యాంక్ ఆఫ్ అమెరికా (232 బిలియన్‌ డాలర్లు), చైనాకు చెందిన ICBC (224 బిలియన్‌ డాలర్లు), అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా (171 బిలియన్‌ డాలర్లు), వెల్స్ ఫార్గో (163 బిలియన్‌ డాలర్లు), HSBC (160 బిలియన్‌ డాలర్లు) మాత్రమే HDFC బ్యాంక్ కంటే ముందు ఉన్నాయి.

మోర్గాన్ స్టాన్లీ (143 బిలియన్‌ డాలర్లు), గోల్డ్‌మన్ సాచ్స్ (108 బిలియన్‌ డాలర్లు) కంటే ఎక్కువ ఎం-క్యాప్ బలాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మెర్జర్‌ ఎంటిటీ సొంతం చేసుకుంది. 

స్టాక్‌ రేటింగ్‌, టార్గెట్‌
ఫారిన్‌ బ్రోకింగ్‌ కంపెనీ జెఫరీస్‌, HDFC బ్యాంక్‌ మీద కవరేజ్‌ను మళ్లీ ప్రారంభించింది. బ్యాంక్‌ స్టాక్‌కు BUY రేటింగ్, రూ. 2,100 టార్గెట్ ప్రైస్‌ ఇచ్చింది.

ఒకే గ్రూప్‌లోని కంపెనీలు సాధారణంగా పేరెంట్‌ కంపెనీలో విలీనం అవుతుంటాయి. ఇక్కడ రివర్స్‌ మెర్జర్‌ జరిగింది. తన పేరెంట్‌ కంపెనీని (HDFC) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనం చేసుకుంది. ఈ మెగా మెర్జర్‌ విలువ దాదాపు 40 బిలియన్‌ డాలర్లు. ఈ విలీనం ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. HDFC లిమిటెడ్‌ షేర్లు ఈ నెల 12న చిట్టచివరి ట్రేడింగ్‌ చేశాయి. ఆ రోజు మార్కెట్‌ ముగింపుతో అవి చరిత్రలో కలిసిపోయాయి.

గత శుక్రవారం (14 జులై 2023) నాడు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3,11,03,96,492 కొత్త ఈక్విటీ షేర్లు అర్హులైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లకు కేటాయించింది. హెచ్‌డీఎఫ్‌సీలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 25 షేర్లకు బదులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లను ఇష్యూ చేసింది.

ఇవాళ ఉదయం 11.15 గంటల సమయానికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఫ్లాట్‌గా రూ. 1,641.90 వద్ద ట్రేడవుతున్నాయి.

మరో ఆసక్తికర కథనం: వెనుకడుగు వేసిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Praja Palana Vijayotsavalu: హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Praja Palana Vijayotsavalu: హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - భారీగా తరలివస్తున్న అన్నదాతలు
Tecno Phantom V Fold 2 5G: రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
Top Headlines: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - గజ్వేల్‌లో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - గజ్వేల్‌లో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Crime News: నల్గొండ జిల్లాలో అమానవీయం - దివ్యాంగుడైన మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, మూగజీవి అడ్డుకున్నా..
నల్గొండ జిల్లాలో అమానవీయం - దివ్యాంగుడైన మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, మూగజీవి అడ్డుకున్నా..
Embed widget