News
News
X

Gold-Silver Price 24 January 2023: కొద్దికొద్దిగా పెరిగి కొండపై కూర్చున్న పసిడి రేటు, సామాన్యుడికి అందట్లేదు

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Gold-Silver Price 24 January 2023: పసిడి ధర కొద్దిగా పెరిగింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 50 చొప్పున పెరిగాయి. బిస్కట్‌ బంగారం ధర ₹57 వేల పైన కొనసాగుతోంది. కిలో వెండి ధర ₹ 400 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,110 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,350 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,110 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,700 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 53,230 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,070 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹  52,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,110 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,270 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,400 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,160 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,400 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,160 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,110 గా ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 60 పెరిగి ₹ 27,190 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 24 Jan 2023 05:57 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోద ముద్ర- ఈసారి మూడు లక్షల కోట్లతో పద్దు!

తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోద ముద్ర- ఈసారి మూడు లక్షల కోట్లతో పద్దు!

Stocks to watch 31 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ కంపెనీలతో జాగ్రత్త

Stocks to watch 31 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ కంపెనీలతో జాగ్రత్త

Petrol-Diesel Price 31 January 2023: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్‌ రేట్లు, ఏపీలో మాత్రం స్థిరం

Petrol-Diesel Price 31 January 2023: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్‌ రేట్లు, ఏపీలో మాత్రం స్థిరం

Gold-Silver Price 31 January 2023: ₹58k వైపు పసిడి పరుగులు, తెలీకుండానే చల్లగా పెరుగుతోంది

Gold-Silver Price 31 January 2023: ₹58k వైపు పసిడి పరుగులు, తెలీకుండానే చల్లగా పెరుగుతోంది

L&T Q3 Results: ఎల్‌టీ అదుర్స్‌! మాంద్యం పరిస్థితుల్లో లాభం 24% జంప్‌!

L&T Q3 Results: ఎల్‌టీ అదుర్స్‌! మాంద్యం పరిస్థితుల్లో లాభం 24% జంప్‌!

టాప్ స్టోరీస్

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే