News
News
X

Gold-Silver Price 10 January 2023: ₹56 వేలు దాటిన పసిడి ధర, సీరియల్‌లా పెరుగుతూనే ఉంది

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Gold-Silver Price 10 January 2023: బంగారం ధరలు సీరియల్‌లా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 300, స్వచ్ఛమైన పసిడి ₹ 330 చొప్పున పెరిగాయి. బిస్కట్‌ బంగారం రేటు ₹56 వేలను చేరింది. కిలో వెండి ధర ₹ 500 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 51,600 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 56,290 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 51,600 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 56,290 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 52,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,380 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 51,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,290 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 51,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,440 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 51,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,340 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 51,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,340 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 51,600 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,290 గా ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 30 తగ్గి ₹ 28,800 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 10 Jan 2023 06:28 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Stock Market News: చారిత్రక పతనం నుంచి కోలుకున్న అదానీ షేర్లు - సెన్సెక్స్‌ 909, నిఫ్టీ 243 ప్లస్సు!

Stock Market News: చారిత్రక పతనం నుంచి కోలుకున్న అదానీ షేర్లు - సెన్సెక్స్‌ 909, నిఫ్టీ 243 ప్లస్సు!

Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్‌ రేటింగ్స్‌ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్‌ రేటింగ్స్‌ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

3C Budget Stocks: స్టాక్‌ మార్కెట్‌లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్‌

3C Budget Stocks: స్టాక్‌ మార్కెట్‌లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్‌

Cryptocurrency Prices: ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్ల పతనం - భారీగా పడ్డ బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్ల పతనం - భారీగా పడ్డ బిట్‌కాయిన్‌!

టాప్ స్టోరీస్

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు   !

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !