By: ABP Desam | Updated at : 01 Apr 2022 06:33 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నిలకడగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.800 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,980 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,300 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,980గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,290గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.25 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.23,850 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్
Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!