By: ABP Desam | Updated at : 08 Feb 2023 12:16 PM (IST)
Edited By: Arunmali
మళ్లీ టాప్-20 లిస్ట్‌లోకి గౌతమ్ అదానీ
Gautam Adani Net Worth: భారతదేశ బిలీయనీర్, అదానీ గ్రూప్ (Adani Group) అధినేత గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద (Gautam Adani Net Worth) మళ్లీ పెరగడం ప్రారంభమైంది. దీంతో, ఆయన మరోసారి ప్రపంచ టాప్-20 సంపన్నుల జాబితాలోకి తిరిగి వచ్చారు.
మంగళవారం (07 ఫిబ్రవరి 2023) అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెరుగుదల నమోదైంది. గ్రూప్‌లోని చాలా స్టాక్స్ అప్పర్ సర్క్యూట్స్‌లోకి వెళ్లాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీల షేర్లను తాకట్టు పెట్టి గతంలో తీసుకున్న రుణాలను వెంటనే తీర్చేయాలని అదానీ గ్రూప్ ప్రమోటర్లు సోమవారం నిర్ణయించారు. వాస్తవానికి, ఆ షేర్లను తాకట్టు నుంచి విడిపించుకోవడానికి 2024 సెప్టెంబర్ వరకు గడువు ఉన్నా, స్టాక్ ధరల్లో పతనాన్ని అడ్డుకోవడానికి, ఆయా అప్పులను గడువుకు ముందే చెల్లించాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 1.1 బిలియన్ డాలర్ల రుణాలను ప్రీపెయిడ్ చేస్తామని ప్రకటించారు. అందువల్ల స్టాక్స్‌లో రికవరీ జరిగింది. దీంతో గౌతమ్ అదానీ మొత్తం నికర విలువలో కూడా పెరుగుదల నమోదైంది.
అదానీ నికర విలువ ఎంత పెరిగింది?
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా (Forbes Billionaires List) ప్రకారం, గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ 62.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్‌లో అదానీ 17వ స్థానానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 7న అదానీ గ్రూప్ షేర్ ధరలు పెరిగిన తర్వాత, అదానీ సంపద మొత్తం 463 మిలియన్ డాలర్లు పెరిగింది. అందువల్లే అదానీ టాప్-20 సంపన్నుల జాబితాలోకి తిరిగి వచ్చారు.
ముఖేష్ అంబానీ సంపద ఎంతో తెలుసా?
గౌతమ్ అదానీ ఆస్తుల విలువ ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఛైర్మన్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) గురించి చెప్పుకోవడం కూడా పరిపాటి. భారత్‌తోపాటు ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ. ఆయన మొత్తం నికర విలువ (Mukesh Amabni Net worth) 82.5 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం... ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ LVMH Moet హెన్నెస్సీ లూయిస్ విట్టన్ CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన సొంత ఆస్తుల విలువ 213.2 బిలియన్ డాలర్లు. టెస్లా & ట్విట్టర్ సహా అనేక ప్రపంచ స్థాయి కంపెనీలకు యజమాని అయిన ఎలాన్ మస్క్ (Elon Musk) రెండో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం నికర విలువ 188.6 బిలియన్ డాలర్లు. అదే సమయంలో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తి. ఆయన మొత్తం ఆస్తుల విలువ 125.3 బిలియన్ డాలర్లు.
ఒకప్పుడు ప్రపంచంలో మూడో ధనవంతుడు
ఒకానొక సమయంలో, గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడు. కానీ, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత, అంటే, 2023 జనవరి 24 నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ పతనం కనిపించింది. ఆ తర్వాత 9 ట్రేడింగ్ రోజుల్లోనే, అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9.5 లక్షల కోట్లు, అంటే 49 శాతం తగ్గింది. ఈ భారీ క్షీణత కారణంగా, టాప్-20 సంపన్నుల జాబితా నుంచి కూడా గత వారం బయటకు వచ్చారు అదానీ.
Cryptocurrency Prices: క్రిప్టో జస్ట్ మూవింగ్! బిట్‌కాయిన్ @ రూ.24.42 లక్షలు
Gold-Silver Price 02 April 2023: ₹60 వేలను వదిలి దిగనంటున్న బంగారం, వెండి రేటూ పెరుగుతోంది
Petrol-Diesel Price 02 April 2023: బండిలో పడే ప్రతి చుక్కా బంగారమే, ధరలు మండుతున్నాయ్
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు