By: ABP Desam | Updated at : 11 Apr 2023 08:23 AM (IST)
Edited By: Arunmali
ఐటీ వద్దు, ఎఫ్‌ఎంసీజీ ముద్దు
Share Market: గత ఆర్థిక సంవత్సరం (2022-23) మొత్తం తీవ్ర అనిశ్చితుల మధ్య స్టాక్ మార్కెట్ ప్రయాణం సాగింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (Foriegn Portfolio Investors) పెట్టుబడుల ధోరణిని కూడా ఈ ఒడిదొడుకులు ప్రభావితం చేశాయి. దేశీయ మార్కెట్లో, FY 2022-23 సమయంలో, FPIలు IT స్టాక్స్ దూరంగా ఉన్నారు. అదే సమయంలో FMCG స్టాక్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టారు.
విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపిన కారణాలు
డేటా ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో FMCG స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పైగా పెరిగాయి. అదే కాలంలో IT స్టాక్స్‌లో పెట్టుబడులు సుమారు 1.23 లక్షల కోట్ల రూపాయలు తగ్గాయి. FPIల పెట్టుబడి ధోరణిలో ఈ మార్పునకు కారణాలు.. వడ్డీ రేట్ల నిరంతర పెరుగుదల, ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కమ్మేసే ప్రమాదం.
భారీగా పెరిగిన FMCG ఇండెక్స్
గత ఆర్థిక సంవత్సరంలో, విదేశీ మదుపుదార్లు (FPIs) రూ. 15,561 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడంతో హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, కోల్‌గేట్ పామోలివ్ వంటి FMCG కౌంటర్లు బలపడ్డాయి. ఈ కారణంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ (S&P BSE FMCG Index) 23.64 శాతం పెరిగింది. FMCG సెక్టార్‌తో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్ రంగాలకు కూడా FPIలు ప్రాధాన్యత ఇచ్చారు.
FY 2021-22 ముగింపు నాటికి FMCG రంగంలో ఓవర్సీస్ ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ రూ. 1,27,877 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత, అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది రూ. 3,32,767 కోట్లకు పెరిగింది. అంటే, గత ఏడాది కాలంలో FMCG స్టాక్స్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 2,04,890 కోట్లు పెరిగాయి. అదేవిధంగా... ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌లో రూ. 1,29,208 కోట్లు, ఆటోమొబైల్ షేర్లలో రూ. 69,695 కోట్ల మేర FPIs ఎక్స్‌పోజర్ పెరిగింది.
ఫారినర్లు వద్దనుకున్న సెక్టార్లు
మరోవైపు, సమీక్ష కాలంలో రియాల్టీ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు రూ. 9,574 కోట్లు తగ్గాయి. చమురు & గ్యాస్ స్టాక్స్‌లోనూ, FY22 ముగింపు నాటికి ఉన్న రూ. 5,33,125 కోట్ల ఎక్స్‌పోజర్‌తో పోలిస్తే, FY23 ముగింపు నాటికి రూ. 82,566 కోట్లు తగ్గి రూ. 4,50,559 కోట్లకు చేరుకుంది. అదే విధంగా, ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా రూ. 6,89,838 కోట్ల నుంచి రూ. 5,66,449 కోట్లకు దిగి వచ్చింది, ఏడాదిలో రూ. 1,23,389 కోట్లు తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Adani Group: అడక్కుండానే వరాలు ఇస్తున్న అదానీ స్టాక్స్, రెండు రోజుల ర్యాలీతో రూ.12 లక్షల కోట్ల మైల్‌స్టోన్
Rupee Against Dollar: రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్ - ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి
SBI Offer: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ ఆఫర్, ఈ నెలాఖరు వరకే లక్కీ ఛాన్స్!
Aadhar Card: మీ ఆధార్ కార్డ్ డెడ్‌లైన్ అతి దగ్గర్లో ఉంది, గడువు దాటకముందే జాగ్రత్త పడండి
Latest Gold-Silver Prices Today 05 December 2023: ఎన్నడూ లేనంత భారీగా పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
/body>