అన్వేషించండి

VerSe Innovation: అంతర్జాతీయ స్థాయికి ఎదిగే లక్ష్యంతో వెర్సె ఇన్నోవేషన్ - బోర్డులో డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్ పి.ఆర్. రమేష్‌

VerSe Innovation: వెర్సే ఇన్నోవేషన్ సంస్థలో బోర్డులో డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్ పి.ఆర్. రమేష్‌ ఇండిపెండెంట్ బోర్డు మెంబర్ గా చేరారు. ఆడిట్ కమిటీ ఛైర్మన్‌ గా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు.

లోకల్ లాంగ్వేజ్ ఏఐ  టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న VerSe Innovation తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రంగంలో మేధావిగా గుర్తింపు పొందిన, డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్  పి.ఆర్. రమేష్‌ ను తమ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆయన కేవలం డైరెక్టర్‌గానే కాకుండా, సంస్థ ఆర్థిక పారదర్శకతను పర్యవేక్షించే  ఆడిట్ కమిటీ ఛైర్మన్‌ గా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు.                           

నా లుగు దశాబ్దాలకు పైగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా విశేష అనుభవం ఉన్న పి.ఆర్. రమేష్ రాకతో VerSe సంస్థకు అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు తోడవుతాయని  భావిస్తున్నారు. గతంలో డెలాయిట్ గ్లోబల్ బోర్డులో సభ్యుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం ఎయిర్ ఇండియా, నెస్లే ఇండియా, సిప్లా వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి  బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవార్డును అందుకోవడం ఆయన వృత్తిపరమైన నిబద్ధతకు నిదర్శనం.

సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న రమేష్ అనుభవం తమకు ఎంతో కీలకమని VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ పేర్కొన్నారు. ఒక అంకుర సంస్థ  స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో బలమైన ఆర్థిక క్రమశిక్షణ, రిస్క్ మేనేజ్‌మెంట్ అత్యవసరమని, రమేష్ మార్గదర్శకత్వంలో తమ సంస్థ ఆ లక్ష్యాలను సులువుగా చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన వృద్ధి దిశగా మేనేజ్‌మెంట్ టీంతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రమేష్ కూడా స్పష్టం చేశారు.                   

టెక్నాలజీ సాయంతో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న VerSe Innovation గ్రూపులో  డైలీహంట్  , జోష్   , మ్యాగ్జ్‌టర్  , నెక్స్ వర్స్ (NexVerse.ai) వంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. వందల మిలియన్ల మంది వినియోగదారులకు స్థానిక భాషల్లో కంటెంట్‌ను అందిస్తూ దూసుకుపోతున్న ఈ సంస్థలో గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్ మాన్ సాక్స్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు పి.ఆర్. రమేష్ వంటి నిపుణుడు బోర్డులోకి రావడంతో ఇన్వెస్టర్లలో కూడా సంస్థపై నమ్మకం మరింత పెరగనుంది.                        

 కేవలం వృద్ధి మీద మాత్రమే కాకుండా, పారదర్శకమైన ఆర్థిక విధానాలు , సుస్థిరమైన నిర్వహణ ప్రమాణాల మీద VerSe దృష్టి పెట్టిందని ఈ నియామకం స్పష్టం చేస్తోంది. ఏఐ ఆధారిత ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్న ఈ సంస్థ, తన సంస్థాగత విశ్వసనీయతను పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని భారీ లక్ష్యాలను సాధించేందుకు సిద్ధమవుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget