By: ABP Desam | Updated at : 26 Dec 2022 11:20 AM (IST)
Edited By: Arunmali
ఇండియన్ ఈక్విటీల మీద ₹11,557 కోట్ల ఫారిన్ బెట్స్
Foreign Portfolio Investors: చైనా, అమెరికాతో పాటు కొన్ని ప్రపంచ దేశాల్లో కోవిడ్ కొత్త వేవ్ ప్రబలి, భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపులో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల మొండి వైఖరి, పొంచివున్న ఆర్థిక మాద్యం, దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా అభివృద్ధి చెందిన దేశాల స్టాక్ మార్కెట్లు ఇప్పటికే భారీగా పతనమయ్యాయి. కొత్తగా విస్తరిస్తున్న కొవిడ్ BF 7 సబ్ వేరియంట్ కారణంగా ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలు మరింత పెరిగాయి. అయితే, డీ-కప్లింగ్ కారణంగా ఇండియన్ మార్కెట్ల మీద పెద్దగా ప్రభావం పడలేదు.
కొవిడ్ కొత్త వేవ్ సహా చాలా స్థూల ఆందోళనలు ఉన్నప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు (Foreign Portfolio Investors - FPIs) భారతీయ మార్కెట్ మీద ఇప్పటికీ నమ్మకంతో ఉన్నారు, భారీగా బెట్టింగ్ చేస్తున్నారు. 2022 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు (డిసెంబర్ 23వ తేదీ), FPIలు భారతీయ స్టాక్ మార్కెట్లలోకి రూ. 11,557 కోట్ల పెట్టుబడులు తెచ్చారు.
డిసెంబర్‌లో FPIలు కొన్నవి - అమ్మినవి
ఈ డబ్బుతో ఆటో, క్యాపిటల్ గూడ్స్, FMCG, రియల్ ఎస్టేట్ స్టాక్స్‌ను ఎక్కువగా కొన్నారు. ఇదే సమయంలో.. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఫైనాన్షియల్స్ స్టాక్స్‌ను ఎక్కువగా అమ్మారు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మీద విదేశీయులకు ఉన్న నమ్మకం, US డాలర్ ఇండెక్స్‌లో బలహీనత ఈ పెట్టుబడులకు కారణాలు. ఒక్క భారత్ మినహా, ఈ నెలలో ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్, ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో FPI ఫ్లో నెగెటివ్‌గా ఉంది. అంటే భారత్‌ను తప్ప ఏ ఎమర్జింగ్ కంట్రీ మీద ఫారిన్ ఇన్వెస్టర్లకు ఆశలు లేవు.
అంతకుముందు, 2022 నవంబర్‌లో భారతీయ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.36,200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో రూ. 8 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
మొత్తం మీద, 2022లో ఇప్పటివరకు (డిసెంబర్ 23వ తేదీ వరకు) ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు రూ. 1.21 లక్షల కోట్ల మొత్తాన్ని నికరంగా ఉపసంహరించుకున్నారు.
డిసెంబరులో డెట్ మార్కెట్ల నుంచి రూ. 2,900 కోట్ల నికర మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారు.
జాగ్రత్తగా వ్యవహరిస్తున్న FPIలు
2022 డిసెంబరు 23తో ముగిసిన వారంలో FPIల నెట్ ఇన్‌ఫ్లోలు రూ. 1,000 కోట్ల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. అంతకు ముందు వారంలో ఈ మొత్తం రూ. 6,055 కోట్లుగా ఉంది. ఇటీవలి పరిణామాలు, కొనసాగుతున్న అనిశ్చితి దృష్ట్యా విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Geojit Financial Services) చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ చెబుతున్న ప్రకారం... అమెరికా మాక్రో డేటా, కోవిడ్ సంబంధిత వార్తలు ఇకపై FPIల పెట్టుబడులు, మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Economic Survey 2023: భారత ఎకానమీకి 5 బూస్టర్లు - ట్రెండ్ కొనసాగిస్తే మన రేంజు మారిపోద్ది!
Adani Enterprises FPO: అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO సూపర్ హిట్టు! పూర్తిగా సబ్‌స్క్రైబ్ - ఇన్వెస్టర్లకు భయం పోయిందా?
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!
Cryptocurrency Prices: ఒక్కసారిగా పడిపోయిన బిట్ కాయిన్ - రూ.55 వేలు డౌన్!
Adani Group Buyback: అదానీ షేర్లలో బైబ్యాక్ ఉత్సాహం, తూచ్ అంతా ఉత్తదేనన్న మేనేజ్మెంట్
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి