By: ABP Desam | Updated at : 20 Jul 2023 12:29 PM (IST)
ఫారిన్ ఇన్వెస్టర్ల ఫోకస్ వాటి పైనే, ఇక ఆ షేర్లను ఆపతరమా?
FPIs inflows: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి డాలర్ల ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) ఈ నెల మొదటి 15 రోజుల్లోనే నికరంగా 306.60 బిలియన్ రూపాయల (3.74 బిలియన్ డాలర్లు) విలువైన ఇండియన్ షేర్లను కొన్నారు. వరుసగా ఐదో నెలలోనూ నెట్ బయ్యర్స్‌గా నిలిచారు.
FPI డాలర్ ఇన్‌ఫ్లోస్‌తో నిఫ్టీ50, సెన్సెక్స్ ఇండెక్స్‌లు బ్రేకుల్లేని బళ్లలా దూసుకెళ్తున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ప్రస్తుతం రికార్డు హైస్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నెల మొదటి అర్ధభాగంలో నిఫ్టీ50 దాదాపు 2% పెరిగింది.
ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు, FPIలు 1,393.50 బిలియన్ రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. నిఫ్టీ50 ర్యాలీకి ఇది ఆజ్యం పోసింది. NSE ఎలైట్ ఇండెక్స్, మార్చి 1 - జులై 15 మధ్య కాలంలో ఏకంగా 13% ర్యాలీ చేసింది.
భారతదేశ ఆర్థిక మూలాలు బలంగా ఉండడం, Q1లో కార్పొరేట్ ఆదాయాలపై అంచనాలు, చైనాలో రికవరీపై ఉన్న ఆందోళనల కారణంగా విదేశీ ఫండ్స్ భారత్‌లోకి వచ్చి పడుతున్నాయి. ఇటీవలి నెలల్లో.. ఆర్థిక మందగమనం, ఇన్‌ఫ్లేషన్, రెసిషన్ భయాలతో ప్రపంచ దేశాలు అల్లాడితే, ఇండియా మాత్రం సూపర్ గ్రోత్‌తో ఆకట్టుకుంది. అందువల్లే ఓవర్సీస్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియాలో ల్యాండ్ చేస్తున్నారు.
జులైలో FPIలు ఏ షేర్లను కొనుగోలు చేశారు?
జూన్‌లో 192.29 బిలియన్ రూపాయల విలువైన షేర్లను కొన్న ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ఈ నెల మొదటి అర్ధభాగంలో ఆర్థిక సేవల రంగానికి (financial services sector) ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఈ సెక్టార్‌లో 70.5 బిలియన్ రూపాయల విలువైన ఈక్విటీలను కొత్తగా యాడ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు ఇదే ఈ రంగంలో నెట్ సెల్లర్స్‌గా ఉన్నారు.
ఫైనాన్షియల్స్‌లో FPI ఆసక్తికి 4 కారణాలు ఉన్నాయి:
1. ఆర్థిక సేవల రంగంలో స్టేబుల్ ఎర్నింగ్స్
2. ఫైనాన్షియల్ కంపెనీల స్టెడీ లోన్ గ్రోత్
3. అసెట్ క్వాలిటీలో మెరుగుదల
4. 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇదే సెక్టార్‌లో 299.93 బిలియన్ రూపాయల షేర్లను అమ్మడం
ఫైనాన్షియల్ సెక్టార్ తర్వాత ఫారినర్లు ఆసక్తి చూపిన రంగాలు ఆయిల్ & గ్యాస్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), పవర్, క్యాపిటల్ గూడ్స్.
అమెరికాలో ఆర్థిక పరిస్థితులు చక్కబడుతుండడంతో, వడ్డీ రేట్ల పెంపు విషయంలో U.S. ఫెడరల్ రిజర్వ్ (US FED) దూకుడు తగ్గుతుందని, రేట్లు ఇక పెరగకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) షేర్లలో అమ్మకాలు తగ్గాయి.
మరో ఆసక్తికర కథనం: దూసుకెళుతున్న గోల్డ్ రేటు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Petrol-Diesel Price 01 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Price 01 October 2023: కొండ దిగొస్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>