News
News
X

FPI: స్టాక్‌ మార్కెట్‌లోకి ఉప్పెనలా వస్తున్న విదేశీయుల డబ్బు, ఈ నెలలో ₹5600 కోట్ల ఇన్‌ఫ్లో

భారత్‌లో నెట్‌ బయ్యర్స్‌గా మారారు. జులై నుంచి FPI ఫ్లోస్‌లో స్పష్టమైన ట్రెండ్ రివర్సల్ ఉంది.

FOLLOW US: 

FPI: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్ల విషయంలో ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI‌) ఫుల్‌ రైజింగ్‌లో ఉన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు, దేశీయ మార్కెట్లలోకి దాదాపు రూ.5,600 కోట్లను తీసుకొచ్చారు. పండుగ సీజన్‌లో వినియోగదారుల వ్యయాలు పెరుగుతాయన్న అంచనాలతోపాటు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే మెరుగైన మ్యాక్రో ఫండమెంటల్స్ ఉండడం వల్ల కూడా ఇండియన్‌ మార్కెట్ల మీద అమిత ప్రేమ చూపిస్తున్నారు.

ఆగస్టులో రూ.51,200 కోట్లు, జులైలో దాదాపు రూ.5,000 కోట్ల నికర పెట్టుబడులను పెట్టారు.

గత ఏడాది అక్టోబరు నుంచి వరుసగా తొమ్మిది నెలల పాటు లక్షల కోట్ల రూపాయల విలువైన షేర్లు అమ్మేసి నెట్‌ సెల్లర్స్‌గా ఉన్న విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు రూటు మార్చారు. భారత్‌లో నెట్‌ బయ్యర్స్‌గా మారారు. జులై నుంచి FPI ఫ్లోస్‌లో స్పష్టమైన ట్రెండ్ రివర్సల్ ఉంది.

2021 అక్టోబర్ - 2022 జూన్ మధ్య, మన ఈక్విటీ మార్కెట్లలో రూ. 2.46 లక్షల కోట్ల విలువైన షేర్లను వాళ్లు విక్రయించారు. దీంతో, ఇండియన్‌ ఈక్విటీల రేట్లు భారీగా తగ్గి, వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారాయి.

ఫైనాన్షియల్స్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ టెలికాం స్టాక్స్‌

విదేశీ మదుపుదారులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, అధిక నాణ్యత గల కంపెనీలను ఎంపిక చేసుకుని వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఫైనాన్షియల్స్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ టెలికాం స్టాక్స్‌ను ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

డిపాజిటరీల డేటా ప్రకారం... ఈ నెల 1-9 మధ్య కాలంలో FPIలు భారతీయ ఈక్విటీల్లోకి రూ.5,593 కోట్ల నికర మొత్తాన్ని పంప్ చేశారు.

డెట్ మార్కెట్‌లోకి రూ.158 కోట్లు

దీనికి అదనంగా, ఇదే నెలలో రూ.158 కోట్ల నికర మొత్తాన్ని డెట్ మార్కెట్‌లోకి చేర్చారు.

మరికొన్న రోజుల్లో యూఎస్‌ ఫెడ్‌ సమావేశం ఉంది, రేట్ల పెంపును మార్కెట్లు ఆశిస్తున్నాయి. అయితే, యుఎస్ ఫెడ్ ఫలితాలతో సంబంధం లేకుండా FPI ఇండియన్‌ ఈక్విటీలను కొనుగోలు చేయడం కొనసాగిస్తారని కొందరు ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు. అమెరికా, యూరో జోన్, చైనా మార్కెట్లు మందగించిన నేపథ్యంలో, పెట్టుబడుల కోసం భారతదేశం ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా అభివర్ణించారు. అందుకే విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా వస్తు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు దిగి రావడం, దేశీయ బాండ్ ఈల్డ్స్‌ తగ్గుముఖం పట్టడం,  రానున్న పండుగల సీజన్‌ నేపథ్యంలో ఇండియన్‌ మార్కెట్లు ఊపు మీద ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్‌ వెల్లడించింది.

ఇక, ఈ నెల 21న జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశ ఫలితాల మీద విదేశీ పెట్టుబడిదారులు దృష్టి పెడతారు. వడ్డీ రేట్లను ఫెడ్ 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది.

భారతదేశంతో పాటు, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు కూడా FPIల ఇన్‌ఫ్లోలను చూశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 12 Sep 2022 12:47 PM (IST) Tags: September Stock Market FPIS Foreign Portfolio Investors Indian equities

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 6 October: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 6 October: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ

Gold-Silver Price: బెంబేలెత్తిస్తున్న పసిడి ధర - నేడు మరింత పైపైకి, పండగ వేళ డిమాండే కారణమా?

Gold-Silver Price: బెంబేలెత్తిస్తున్న పసిడి ధర - నేడు మరింత పైపైకి, పండగ వేళ డిమాండే కారణమా?

Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన

Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన

Petrol-Diesel Price, 5 October: పండగ రోజు ఎగబాకిన ఇంధన ధరలు - మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 5 October: పండగ రోజు ఎగబాకిన ఇంధన ధరలు - మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవీ

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు