అన్వేషించండి

SBI Scheme: తక్కువ టైమ్‌లో గ్యారెంటీగా భారీ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాల గడువుతో డబ్బులు డిపాజిట్‌ చేయొచ్చు.

SBI Sarvottam FD Scheme Details: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India), చాలా రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను (SBI Fixed Deposit Scheme) ఆఫర్‌ చేస్తోంది. వీటిలో కొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు ప్రత్యేకం. ఎందుకంటే ఆ డిపాజిట్ల కాల గడువు (మెచ్యూరిటీ టైమ్‌), బ్యాంక్‌ చెల్లించే వడ్డీ రేటు ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి పథకాల్లో సర్వోత్తమ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఒకటి.
 
నాన్‌-కాలబుల్‌ డిపాజిట్‌ స్కీమ్‌  (Non-Callable Fixed Deposit Scheme)

SBI అమలు చేస్తున్న సర్వోత్తమ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ఒక నాన్‌-కాలబుల్‌ డిపాజిట్‌ స్కీమ్‌. అంటే కాల పరిమితి లేదా మెచ్యూరిటీ గడువు ముగియడానికి ముందే ఈ ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోవడానికి అనుమతి ఉండదు. 

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో ఎంత డిపాజిట్‌ చేయవచ్చు?

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో కనిష్ఠంగా రూ. 1 కోటి రూపాయలు (sbi sarvottam fd minimum deposit amount) పెట్టుబడి పెట్టాలి. గతంలో కనిష్ట పరిమితి రూ. 15 లక్షలుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇటీవల, 'నాన్-కాలబుల్‌' ఫిక్స్‌డ్ డిపాజిట్ కనీస డిపాజిట్‌ మొత్తాన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచింది. ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో గరిష్ట డిపాజిట్‌ పరిమితి (sbi sarvottam fd maximum deposit amount) లేదు. 

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో ఎంత వడ్డీ వస్తుంది? (SBI Sarvotham Scheme Interest Rate)

7.10 శాతం నుంచి 7.90 శాతం వరకు వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 

స్టేట్‌ బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ టర్మ్‌ ప్లాన్‌లో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాల గడువుతో డబ్బులు డిపాజిట్‌ చేయొచ్చు. ఇందులోనూ రెండు రకాల ప్లాన్స్‌ ఉన్నాయి. రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల డిపాజిట్‌ మొత్తానికి ఒక ప్లాన్‌; రూ.2 కోట్లు దాటిన మొత్తానికి మరొక ప్లాన్‌ ఉంటుంది.   

రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల లోపున్న డిపాజిట్లపై వడ్డీ రేటు:

ఏడాది కాల పరిమితితో డిపాజిట్‌ చేసే సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వాళ్లకు) బ్యాంక్‌ 7.10 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. రెండేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  

ఇదే కాలానికి సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్లు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) డిపాజిట్‌ చేస్తే, మరో 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే, ఏడాది కాల వ్యవధి సర్వోత్తమ్‌ స్కీమ్‌ డిపాజిట్‌లో సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల డిపాజిట్లపై 7.90% వడ్డీ రేటును పొందుతారు. ఇది 8.14% వార్షిక రాబడికి మారుతుంది. 

రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై వడ్డీ రేటు:

రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై, ఒక సంవత్సరం కాల వ్యవధికి, సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు 7.05 శాతం. ఇదే డిపాజిట్‌పై రెండేళ్లకు ఆఫర్‌ చేస్తున్న వడ్డీ రేటు 6.90 శాతం. 

సీనియర్ సిటిజన్లు ఒక సంవత్సరం కోసం డిపాజిట్‌ చేస్తే 7.55 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది. రెండేళ్ల కోసం డిపాజిట్‌ చేస్తే 7.40 శాతం వడ్డీ పొందొచ్చు, ఇది 7.61% వార్షిక రాబడికి మారుతుంది. 

2023 ఫిబ్రవరి 17 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.

SBI సర్వోత్తమ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు అర్హులు? ‍‌(Who is eligible to invest in SBI Sarvotham Fixed Deposit Scheme?)

SBI సర్వోత్తమ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో ఇండివిడ్యువల్స్‌, నాన్‌-ఇండివిడ్యువల్స్‌ పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్లు, NRIలు అనర్హులు. 

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో కాల గడువు ముగిసిన తర్వాత ఆ డిపాజిట్లను రెన్యువల్‌ చేయించుకోవడానికి వీలుండదు. సంబంధిత కాల పరిమితి ముగియగానే వడ్డీతో కలిపి ఆ మొత్తం పెట్టుబడిదారు ఖాతాలో జమవుతుంది. మీకు ఆ స్కీమ్‌ మళ్లీ కావాలంటే, ఫ్రెష్‌గా డిపాజిట్‌ చేయాలి.

మరో ఆసక్తికర కథనం: యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget