అన్వేషించండి

China edu crash : చైనాలో అంతే..! ఆ టీచర్‌కు ఒక్క రోజులో రూ. లక్ష కోట్ల లాస్..!

విద్యను వ్యాపారంగా చేయడాన్ని చైనా సర్కార్ నిషేధించింది. దీంతో ఆన్ లైన్ టీచింగ్ యాప్‌లు నిర్వహిస్తున్న కంపెనీలు భారీగా నష్టపోయాయి.

China edu crash : చైనాలో అంతే..! ఆ టీచర్‌కు ఒక్క రోజులో రూ. లక్ష కోట్ల లాస్..!

ఒక వ్యక్తికి లక్ష కోట్ల సంపద ఉంది. దాన్ని రాత్రికి రాత్రి 98 శాతం పోగొట్టుకోలగరా..?. గుర్రప్పందాలు అడినా... పోకర్ ఆడినా... బెట్టింగ్ కాసినా.. అంత మొత్తంలో  పోగొట్టుకోవడం సాధ్యం కాదనుకుంటారా..?. కానీ అవేమీ ఆడకుండానే.. చైనా ప్రభుత్వం అందర్నీ అలా బికారుల్ని చేసేస్తుంది. చేసేసింది కూడా.  చైనా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల కొంత మంత్రి రాత్రికి రాత్రే తమ సంపదలో 90 శాతానికి కోల్పోయారు. అసలేం జరిగిందంటే..!

చైనాలో అన్నింటితోనూ ఇటీవలి కాలంలో ఆన్ లైన్ టీచింగ్ బిజినెస్ విపరీతంగా పెరిగింది. మన దేశంలో బైజూస్ ఎలా సంచలనాత్మకంగా ఎదిగిందో.. చైనాలోనూ ఓ "గౌటు టెచ్‌డు ఇంక్" అనే  కంపెనీ కూడా ఆన్ లైన్ విద్యను బోధించడంలో బాగా పేరు తెచ్చుకుంది. లారీ చెన్ అనే ఓ స్కూల్ టీచర్ దీన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే చైనాలో అతి పెద్ద ఆన్ లైన్ విద్య అందించే యాప్‌గా మారిపోయింది. దీంతో ఈ సంస్థ  బిజినెస్ కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్ ఉందనుకుని అనేక మంది ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అలాంటిది ఈ కంపెనీ విలువ బిలియన్ డాలర్లలలోకి చేరిపోయింది. ఫలితంగా లారీ చెన్.. ఆస్తులు పదిహేను బిలియన్ డాలర్లకుపైగా పెరిగిపోయాయి. అంటే మన రూపాయల్లో లక్షా ఇరవై వేల కోట్లకుపైగా అన్నమాట. దీంతో ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మారారు.

అయితే చైనా ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకు వచ్చింది. ఆ చట్టం ప్రకారం.. ఎవరైనా సరే చదువును వ్యాపార ప్రయోజనాల కోసం.. లాభాల కోసం చెప్పకూడదు. అలా చెబితే శిక్షార్హులవుతారు. అంటే.. అక్కడ విద్య అనేది వ్యాపార వస్తువుకాదన్నమాట. ఇప్పటి వరకూ ఈ టీచింగ్ యాప్‌లు అన్నీ లాభాల కోసమే పని చేస్తున్నాయి. దీంతో అవన్నీ తమ కార్యకలాపాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా సర్కార్ ఈ రూల్స్ అమల్లోకి తేవడంతోనే... లారీ చెన్ కంపెనీ షేర్లు ఒక్క సారిగా పాతాళంలోకి పడిపోయాయి. ఎంతగా అంటే.. లారీ చెన్ సంపద 98 శాతం కరిగిపోయింది. 
 
పదిహేను బిలియన్ డాలర్లు రాత్రికి రాత్రి కోల్పోయారు. అంటే 1 లక్షా 12 500 కోట్లు లాస్ అన్నమాట. చివరికి రెండు శాతం సంపద మిగిలిదింది. దీంతో  బిలియనీర్ హోదా కూడా కోల్పోయాడు. అయితే చైనా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం ఆయన చేయలేరు. చేస్తే శాల్తీ కూడా కనిపించదు. అందుకే..  మౌనంగా రోదిస్తున్నాడు. ఈ బాధ ఆయనొక్కడితే కాదు.. చైనాలో ఇలాంటి ఎడ్యూకేషన్ యాప్‌లు నిర్వహిస్తున్న వారందరిదీ అదే బాట. అందరూ సంపదను కోల్పోయారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget