ఆదాయం పెంచుకోవాడానికి ఈపీఎఫ్ఓ కసరత్తు- ఆర్థిక మంత్రితో కీలక చర్చలు
ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రిడెంప్షన్ ద్వారా వచ్చే మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లోకి తిరిగి పెట్టుబడి పెట్టే అవకాశంపై కేంద్ర ఆర్థిక శాఖతో EPFO చర్చలు ప్రారంభించింది.
ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) నుంచి రిడెంప్షన్ ద్వారా వచ్చే మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లోకి తిరిగి పెట్టుబడి పెట్టే అవకాశంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు ప్రారంభించింది. మార్కెట్ అస్థిరత నుంచి లాభాలను కాపాడుకుంటూ ఈక్విటీ రాబడిని ఆప్టిమైజ్ చేయడానికి వ్యూహాలను కూడా సూచించినట్లు తెలుస్తోంది.
EPFO అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ, సెంట్రల్ బోర్డ్ ట్రస్టీస్ (CBT) మార్చి చివరి వారంలో సమావేశం అయ్యాయి. ఆ సయమంలో ETFలలో పెట్టుబడుల ద్వారా రిడెంప్షన్ ఆదాయాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడానికి రిటైర్మెంట్ ఫండ్ బాడీకి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.
పదవీ విరమణ నిధులను పెంచే ఈటీఎఫ్‌ల నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ప్రస్తుతం, ఆర్థిక శాఖ పెట్టుబడి నిబంధనలకు అనుగుణంగా, EPFO తన ఆదాయంలో 5-15 శాతం ఈక్విటీలు, సంబంధిత పెట్టుబడులకు కేటాయించవచ్చు. అయితే ETF పెట్టుబడి మార్గదర్శకాల్లో అనేక ఇతర మార్పులు చేయాలని EPFO కోరుతోంది.
ETF పెట్టుబడి వ్యూహాన్ని అనేక మార్గాల్లో మార్చడానికి ఒక EPFO ప్రతిపాదన తీసుకువచ్చింది. పీరియాడిక్ రిడెంప్షన్లకు బదులుగా ETF రోజువారీ రీడెంప్షన్‌ను అనుమతించాలని, ఆదాయాలను ప్రభుత్వ సెక్యూరిటీలకు లింక్ చేయడం అంశాలను ప్రతిపాదించినట్లు ఆర్థిక నిపుణులు తెలిపారు. సెన్సెక్స్‌లో ఈటీఎఫ్ రిటర్న్ బెంచ్‌మార్క్ నాలుగేళ్ల నుంచి ఐదు సంవత్సరాలకు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నారు.
రిడీమ్ చేయాల్సిన యూనిట్ల హోల్డింగ్ పీరియడ్ రిటర్న్‌లను సెన్సెక్స్ సగటు ఐదేళ్ల రిటర్న్‌ల ఆధారంగా లెక్కించాలని EPFO కూడా ప్రతిపాదించింది. వాటిని రోజువారీ ప్రాతిపదికన విముక్తికి అనుమతించాలని కోరింది. ఈటీఎఫ్ పెట్టుబడి మార్గదర్శకాలకు ప్రతిపాదిత మార్పులపై ఆర్థిక, కార్మిక మంత్రిత్వ శాఖలు ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది. దీని తరువాత రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఆమోదం కోసం తుది ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
ఆగస్ట్ 2015లో నిఫ్టీ 50, BSE సెన్సెక్స్ ఆధారంగా ETFలలో EPFO 5 శాతం పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. తరువాత అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. జనవరి 31 నాటికి, రిటైర్మెంట్ ఫండ్ బాడీ తన ఆదాయంలో 10 శాతం ETFలలో పెట్టుబడి పెట్టింది. దీనిని 15 శాతానికి పెంచుకోవాలని EPFO భావిస్తోంది. ప్రస్తుతం రూ.12.53 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ కార్పస్‌ను EPFO నిర్వహిస్తోంది. ఈక్విటీలు, సంబంధిత సాధనాల్లో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టుబడింది.