అన్వేషించండి

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక 3 రోజుల్లోనే చేతికి డబ్బులు..

EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇకపై ఖాతాదారులు డబ్బు విత్‌డ్రా కోసం రోజుల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ప్రారంభించింది.

PF News: ప్రభుత్వప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ యజమాని నుంచి పీఎఫ్ ఖాతాను ఖచ్చితంగా పొందుతారని మనందరికీ తెలిసిందే. అయితే అత్యవసర సమయాల్లో దీని నుంచి చాలా మంది డబ్బును విత్‌డ్రా చేసుకుంటుంటారు. కరోనా కాలంలో చికిత్స కోసం ఈ సొమ్మును తీసుకునేందుకు అవకాశం కల్పించబడిన సంగతి తెలిసిందే. అయితే కొంత సంక్షిష్టంగా ఉన్న డబ్బు విత్ డ్రా ప్రక్రియను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సులభరం చేయటం చాలా మందిలో సంతోషాన్ని నింపింది. అయితే ముందుగా డబ్బును ఉపసంహరించుకోవటం వల్ల ఉన్న నష్టాన్ని సైతం ఉద్యోగులు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తమ ఖాతాదారులకు ఆరోగ్య సమస్యలకు చికిత్స, విద్య, వివాహం, గృహ కొనుగోలు వంటి అవసరాల కోసం డబ్బును ఉపసంహరించుకునే అనుమతిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియను సులభరం చేయటం శుభవార్తగా చెప్పుకోవాలి. దీనికోసం ఇక నుంచి ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రారంభించింది. కొత్త సిస్టం కింద డబ్బులు విత్ డ్రా కోసం అప్లై చేసిన మూడు రోజుల్లోనే ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమచేయబడుతుంది. గతంలో ఇందుకోసం దాదాపు రెండు వారాల సమయం పట్టేది. దీంతో అత్యవసర సమయంలో చాలా మంది ఇబ్బందిపడటంతో పాటు విసిగిపోయేవారు. 

పీఎఫ్ సభ్యుని అర్హత, క్లెయిమ్ కోసం సమర్పించిన పత్రాలు, KYC స్థితి, చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా మొదలైనవి ధృవీకరించబడినందున EPFO ​​సాధారణంగా ముందస్తు క్లెయిమ్‌ను సెటిల్ చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. కొన్ని సార్లు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందని తెలిసిందే. అయితే కొత్త విధానం ద్వారా ఇకపై మనుషుల ప్రమేయం పూర్తిగా తొలగించబడనుంది. అయితే ఆటో మోడ్ ద్వారా సెటిల్మెంట్ కోసం పీఫ్ ఖాతాదారులు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ 3-4 రోజుల్లోనే పూర్తి కానుంది. గతంలో ఈ పరిమితి రూ.50,000 మాత్రమే ఉండేది.  

కొత్తగా ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనున్న ఆటోమేటిక్ సెటిల్మెంట్ ప్రక్రియ కింద క్లెయిమ్స్ తిరస్కరింపబడవు. దీనికి బదులుగా రెండవ స్థాయి విచారణ, ఆమోదం కోసం ఎస్కలేట్ చేయబడి పరిష్కరించబడనుంది. అయితే ఆటో మోడ్‌లో PF ఖాతా నుంచి అడ్వాన్స్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి, EPFO e-seva పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో సభ్యుడు ఆన్‌లైన్‌లో ఫారం-31 నింపి సమర్పించడం తప్పనిసరి.

అవసరానికి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా ఆమోదయోగ్యమే అయినప్పటికీ.. కొంతమంది తక్కువ రాబడి వస్తుందనే, లేదా ఇతర కారణాలతో అనవసరంగా ఉద్యోగ భవష్యనిధి నుంచి సొమ్మును తీసుకుంటుంటారు. అయితే ఇలా చేయటం వల్ల ఉండే భారీ నష్టం గురించి వారికి తెలియకపోవటం కూడా అందుకు కారణంగా ఉంది. ఖాతాదారులు.. రూ.10 వేలు విత్ డ్రా చేసుకుంటే 20 ఏళ్ల తర్వాత రూ.50 వేలు, 30 ఏళ్ల తర్వాత రూ.లక్ష 14 వేలు నష్టం వాటిల్లుతుంది. అలాగే రూ.20 వేలు విత్ డ్రా చేసుకుంటే 20 ఏళ్ల తర్వాత రూ.1 లక్ష 01 వేలు, 30 ఏళ్ల తర్వాత రూ.2 లక్షల 28 వేలు నష్టపోతారు. అలాగే ఎవరైనా పీఎఫ్ ఖాతా నుంచి ఈరోజు రూ.లక్ష విత్‌డ్రా చేస్తే 20 ఏళ్ల తర్వాత రూ.5 లక్షల 07 వేలు, 30 ఏళ్లలో రూ.11 లక్షల 43 వేలు రాబడిని మిస్ అవుతారు. ఇక్కడ కాంపౌండింగ్ చేసే మాయను వారు మిస్ అవుతారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget