అన్వేషించండి

Adani Case: అదానీ కేసులో ఓ ప్రైవేటు బ్యాంకుపై అనుమానం - మరో 16 సంస్థలపై ఈడీ నజర్‌

Adani Case: అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకుపై అనుమానాలు మొదలయ్యాయి.

Adani Case:

అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మరో 15 సంస్థలకు సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో బయటపడ్డట్టు సమాచారం. ఫారిన్‌ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు సహా 16 కంపెనీల గురించి సెబీకి ఈడీ వివరాలు సమర్పించిందని తెలిసింది.

తీవ్ర ఆర్థిక నేరాలు జరిగినట్టు ధ్రువీకరించుకోనంత వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ కింద కేసు నమోదు చేయలేదు. ఒక కంపెనీ నిబంధనలకు విరుద్ధం నడుచుకుంటుందని అనుమానం వచ్చినా, తప్పు జరుగుతున్నట్టు భావించినా క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ నమోదు చేసే అధికారాలు సెబీకి ఉన్నాయి. ఒకవేళ సెబీ ఆదేశిస్తే మనీ లాండరింగ్‌ కింద ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

భారత స్టాక్‌ మార్కెట్లో జరిగిన అనుమానాస్పద కార్యక్రమాల్లో కొన్ని భారత, విదేశీ సంస్థల జోక్యం ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమాచారం సేకరించినట్టు తెలిసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టు, షార్ట్‌ సెల్లింగ్‌ వ్యవహారంలో వీరికి సంబంధం ఉన్నట్టు గమనించింది.

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో షార్ట్‌ సెల్లింగ్‌ చేయడం వల్ల 12 కంపెనీలు ప్రయోజనం పొందాయని మంగళవారం వార్తలు వచ్చాయి. ఇందులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఉన్నారని సమాచారం. ఇందులో కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు వీలుండే ప్రాంతాల్లో ఆపరేట్‌ అవుతున్నాయి. కొన్ని డొల్ల కంపెనీలూ ఉన్నాయని సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది.

ఈ ఏడాది ఆరంభంలో అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీలపై ఓ నివేదికను బహిర్గతం చేసింది. ఆ దేశ సుప్రీం కోర్టు ఇవ్వొద్దని చెప్పినా ఇలాంటి నివేదికలు ప్రచురించి సోషల్‌ మీడియాలో పెట్టింది. దాంతో భారత స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. అదానీ గ్రూప్‌లోని అన్ని కంపెనీల మార్కెట్‌ విలువ 30-70 శాతం వరకు పడిపోయింది. గౌతమ్ అదానీ సంపద తుడిచి పెట్టుకుపోయింది.

సాధారణంగా షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేశాక ఆ కంపెనీలో లోపాలు, అక్రమాలు జరిగాయన్న రీతిలో హిండెన్‌బర్గ్ రిపోర్టు ఇస్తుంది. అంటే ముందుగానే ఆ కంపెనీ షేర్లను అత్యధిక ధరను అమ్మేస్తుంది. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టేంత వరకు ఎదురు చూస్తుంది. ఒక రేంజులో ప్రైజ్‌ క్రాష్ అయ్యాక తక్కువ ధరకు ఆ షేర్లను కొనుగోలు చేసి లబ్ధి పొందుతుంది. ఉదాహరణకు ఒక కంపెనీ షేర్లను రూ.1000 వద్ద అమ్మేస్తుందని అనుకుందాం. పానిక్‌ సెల్లింగ్‌ వల్ల ఆ షేరు రూ.500కు పడిపోగానే తిరిగి కొనుగోలు చేసుంది. అంటే ఒక్కో షేరుపై రూ.500 వరకు లాభం పొందుతుంది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. సేకరించిన సమాచారాన్ని జులైలో సెబీకి సమర్పించిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. గుర్తించిన కంపెనీల్లో భారత్‌ నుంచి మూడు, మారీషన్‌ నుంచి నాలుగు ఉన్నాయి. వీటి యాజమాన్యం వివరాలు, స్ట్రక్చర్‌ గురించి ఆదాయపన్ను శాఖ వద్ద వివరాలేమీ నమోదు కాలేదని సమాచారం. హిండెన్‌బర్గ్‌ నివేదిక జనవరి 24న పబ్లిష్‌ అవ్వగా మూడు రోజులకు ముందుగానే కొన్ని కంపెనీలు అదానీ గ్రూప్‌లో షార్ట్‌ సెల్లింగ్‌ చేశాయని తెలిసింది.

ఇన్వెస్టర్లు నష్టపోవడం, ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో సుప్రీం కోర్టు అదానీ - హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై కమిటీ వేసింది. అదానీ గ్రూప్‌లో అక్రమాలు, షేర్ల ధరలను ఉద్దేశపూర్వకంగా పెంచారా అన్న దానిపై విచారణ జరిపించింది. కాగా కమిటీ ఇలాంటివేమీ జరగలేదని నివేదిక సమర్పించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amrapali Kata  : రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
Telangna Congress Politics : కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
NTR Health University: ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
In Pics: పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

TFI Producers Meeting Deputy CM Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ కానున్న సినీ నిర్మాతలుHyper Aadi At Alliance Victory Celebrations: పీపుల్స్ మీడియా ఈవెంట్లో హైపర్ ఆది స్పీచ్Vande Bharat for Bhimavaram: భీమవరం రైల్వే ప్రయాణికులకు శుభవార్తKamal Haasan on Krishnam Raju: kalki 2898AD సినిమా ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గురించి కమల్ హాసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amrapali Kata  : రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
Telangna Congress Politics : కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
NTR Health University: ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
In Pics: పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
Nara Lokesh: 'నాకెందుకు స్పెషల్ - అలాంటివేమీ వద్దు' - మంత్రి నారా లోకేశ్ సింప్లిసిటీ, బాధ్యతల స్వీకరణ
'నాకెందుకు స్పెషల్ - అలాంటివేమీ వద్దు' - మంత్రి నారా లోకేశ్ సింప్లిసిటీ, బాధ్యతల స్వీకరణ
Hydeabad: భార్య జల్సాల కోసం దొంగగా మారిన భర్త! గోవా వెళ్లేందుకు చైన్ స్నాచింగ్!
భార్య జల్సాల కోసం దొంగగా మారిన భర్త! గోవా వెళ్లేందుకు చైన్ స్నాచింగ్!
TGBIE Supplementary Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Revanth Delhi Tour :  ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు -  కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
Embed widget