Diwali Muhurat Picks: ఐసీఐసీఐ డైరెక్ట్ ఎంచుకున్న 10 దివాలీ ముహూరత్ స్టాక్స్
బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, ఆటో రంగాల నుంచి వీటికి పక్కకు తీసింది. ఇవి, రాబోయే రోజుల్లో 35 శాతం వరకు రాబడిని పొందగలవని అంచనా వేసింది.
Diwali Muhurat Picks: వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct), పెట్టుబడిదారుల కోసం దీపావళికి ముందస్తుగా తీసుకొచ్చింది. "దివాలీ ముహూరత్ ట్రేడింగ్" కోసం 10 స్టాక్స్‌ను ఎంపిక చేసింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, ఆటో రంగాల నుంచి వీటికి పక్కకు తీసింది. ఇవి, రాబోయే రోజుల్లో 35 శాతం వరకు రాబడిని పొందగలవని అంచనా వేసింది.
ఐసీఐసీఐ డైరెక్ట్ చెబుతున్న 10 దివాలీ ముహూరత్ పిక్స్ ఇవి:
1. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
యాక్సిస్ బ్యాంక్ మీద ‘బయ్’ కాల్‌తో రూ.970 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 20% పెరుగుదలను ఇది సూచిస్తోంది.
2. సిటీ యూనియన్ బ్యాంక్ (City Union Bank)
రూ.215 టార్గెట్ ప్రైస్‌తో ‘బయ్’ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 16% అప్‌సైడ్‌కు అవకాశం ఉంది.
3. అపోలో టైర్లు (Apollo Tyres)
రూ.335 టార్గెట్ ప్రైస్‌తో ‘బయ్’ రేటింగ్ కంటిన్యూ చేసింది. స్టాక్‌లో 23% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను చూస్తోంది.
4. ఐషర్ మోటార్స్ (Eicher Motors)
ఐషర్ మోటార్స్‌పై ‘బయ్’ రేటింగ్, రూ.4,170 టార్గెట్ ప్రైస్‌ను కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 21% వృద్ధి చెందగలదట.
5. కోఫోర్జ్ (Coforge)
దీనికి కూడా రూ.4,170 టార్గెట్ ధరతో బ్రోకరేజ్ ‘బయ్’ కాల్ ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 21% పెరుగుదలను ఇది సూచిస్తోంది.
6. లెమన్ ట్రీ హోటల్స్ (Lemon Tree Hotels)
లెమన్ ట్రీ హోటల్స్‌ను రూ.110 టార్గెట్ ప్రైస్‌తో ‘బయ్’ చేయమంటోంది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 26% అప్‌సైడ్‌కు అవకాశం ఉందట.
7. హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైస్ (Healthcare Global Enterpris)
రూ.345 టార్గెట్ ప్రైస్‌తో ‘బయ్’ కాల్ ఇచ్చింది. ఈ స్టాక్‌లో 18% వృద్ధి అవకాశాన్ని బ్రోకరేజ్ అంచనా వేసింది.
8. లారస్ ల్యాబ్స్ (Laurus Labs)
ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్‌పై ‘బయ్’ కాల్ కంటిన్యూ చేస్తూ, రూ.345 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 35% పెరుగుదలను ఇది సూచిస్తుంది.
9. కంటైనర్ కార్పొరేషన్ (Container corp)
కంటైనర్ కార్ప్ మీద రూ.890 టార్గెట్ ప్రైస్‌తో ‘బయ్’ రేటింగ్ కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 26% వరకు ఇది రాబడి ఇవ్వగలదట.
10. హావెల్స్ ఇండియా (Havells India)
హావెల్స్ ఇండియాకు ‘బయ్’ రేటింట్‌తోపాటు బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ రూ.1,650. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 30% పెరుగుదలను బ్రోకరేజ్ సూచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.