అన్వేషించండి

D-Mart Q2 Results: కొనసాగిన డీమార్ట్ లాభాల పరంపర, ఈసారి రూ.686 కోట్ల ప్రాఫిట్‌

ఏకీకృత నికర లాభాన్ని 64.13 శాతం పెంచుకుని ₹685.71 కోట్లను డి మార్ట్‌ తన కిరాణా బాస్కెట్‌లో వేసుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ₹417.76 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది.

D-Mart Q2 Results: డి-మార్ట్‌ బ్రాండ్‌తో దేశవ్యాప్తంగా కిరాణా వ్యాపారం చేస్తున్న, ప్రజలకు సుపరిచితమైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (Avenue Supermarts Ltd), FY23 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ లాభాల పరంపర కొనసాగించింది. ఖర్చులు (QoQ, YoY రెండింట్లో) తగ్గిన కారణంగా కంపెనీ నికర లాభం పెరిగింది.

ఈ త్రైమాసికంలో, ఏకీకృత నికర లాభాన్ని 64.13 శాతం పెంచుకుని ₹685.71 కోట్లను డి మార్ట్‌ తన కిరాణా బాస్కెట్‌లో వేసుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ₹417.76 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (ఆపరేటింగ్‌ రెవెన్యూ) 36.58 శాతం పెరిగి ₹10,638.33 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది ₹7,788.94 కోట్లుగా ఉంది.

తగ్గిన ఖర్చులు
క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ), ఇయర్-ఆన్-ఇయర్‌లోనూ (YoY) కంపెనీ ఖర్చులు తగ్గాయి. Q2FY23లో, అవెన్యూ సూపర్‌మార్ట్ మొత్తం ఖర్చులను ₹9.638.07 కోట్లుగా ప్రకటించింది. ఏడాది కిందట ఇవి ₹11.997.25 కోట్లుగా ఉన్నాయి. Q1FY23లో మొత్తం ఖర్చులు ₹8,934 కోట్లుగా ఉన్నాయి. 

పెరిగిన ఆస్తులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ రిటైల్ కార్పొరేషన్ మొత్తం ఆస్తులు మెరుగుపడ్డాయి. జులై- సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి మొత్తం ఆస్తులను ₹17152.11 కోట్లుగా ఈ కంపెనీ నివేదించింది, FY22 చివరి నాటికి దీని మొత్తం ఆస్తుల విలువ ₹15403.96 కోట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మొత్తం ఆస్తులను దాదాపు 11.35 శాతం మేర పెంచుకుంది.

Q2FY23లో కంపెనీ మొత్తం నాన్‌-కరెంట్‌ అసెట్స్ ₹11791.72 కోట్లుగా తేలాయి. మొత్తం కరెంట్‌ అసెట్స్‌ ₹5360.39 కోట్లుగా ఉన్నాయి.

అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ ఈక్విటీ, లయబిలిటీస్‌ కూడా పెరిగాయి. 2022 సెప్టెంబర్ త్రైమాసికం ముగిసిన తర్వాత, కంపెనీ మొత్తం ఈక్విటీ, లయబిలిటీస్‌ ₹17,152.11 కోట్లుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపులో ఇవి ₹15,403.96 కోట్లుగా ఉన్నాయి.

షేర్‌ ట్రెండ్‌
శుక్రవారం సెషన్‌లో, డి మార్ట్‌ షేరు ధర 0.28 శాతం తగ్గి, రూ.4,298.05 వద్ద ఆగింది. 

గడిచిన నెల రోజుల్లో ఈ స్టాక్ 0.68 శాతం నష్టపోయి ఫ్లాట్‌గా ఉంది. గత ఆరు నెలల కాలంలో ఒక్కో షేరుకు రూ.242 లేదా 5.97 లాభపడింది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) షేరు ధర రూ.413 లేదా 8.78 శాతం నష్టపోయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget