By: ABP Desam | Updated at : 22 May 2023 06:12 PM (IST)
క్రిప్టో కరెన్సీ
Cryptocurrency Prices Today, 22 May 2023:
క్రిప్టో మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.06 శాతం తగ్గి రూ.22.22 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.43.10 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.19 శాతం పెరిగి రూ.1,50,299 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.18.07 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.01 శాతం పెరిగి రూ.82.90, బైనాన్స్ కాయిన్ 0.31 శాతం తగ్గి రూ.25,576, రిపుల్ 0.80 శాతం తగ్గి రూ.38.34, యూఎస్‌డీ కాయిన్ 0.81 శాతం పెరిగి రూ.82.81, కర్డానో 1.93 శాతం పెరిగి రూ.30.56, డోజీ కాయిన్ 0.08 శాతం తగ్గి 6.06 వద్ద కొనసాగుతున్నాయి. మరుమరు ఎన్‌ఎఫ్‌టీ, టామినెట్, సినాప్సీ, ట్రాన్, మురాసకి, ఈ-రాడిక్స్, రెండర్ లాభపడ్డాయి. ఓఆర్‌డీఐ, కోకోస్ బీసీఎక్స్, కస్పా, పెపె, బ్లాక్స్, మాస్క్ నెట్‌వర్క్, లుస్కో నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Fixed Deposit: స్టేట్ బ్యాంక్ Vs పోస్టాఫీస్ - ఏది బెస్ట్ FD?
Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
Petrol-Diesel Price 03 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Latest Gold-Silver Price Today 03 June 2023: పసిడి భారీ పతనం - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Income Tax: ITR ఫైలింగ్‌లో ఎక్కువ మంది చేస్తున్న తప్పులివి, మీరు చేయకండి
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్