అన్వేషించండి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో రక్త కన్నీరు! బిట్‌కాయిన్‌ రూ.98వేలు లాస్‌!

Cryptocurrency Prices Today, 15 June 2023: క్రిప్టో మార్కెట్లు గురువారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీగా అమ్మకాలు చేపట్టారు.

Cryptocurrency Prices Today, 15 June 2023:

క్రిప్టో మార్కెట్లు గురువారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీగా అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.98 శాతం తగ్గి రూ.20.44 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.39.61 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 6.34 శాతం తగ్గి రూ.1,34,160 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.16.11 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.47 శాతం తగ్గి రూ.81.76, బైనాన్స్‌ కాయిన్‌ 4.69 శాతం తగ్గి రూ.19,338, రిపుల్‌ 6.16 శాతం తగ్గి రూ.38.91, యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.82.15, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 6.38 శాతం తగ్గి రూ.134,075 డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.4.94 వద్ద కొనసాగుతున్నాయి. టెర్రా క్లాసిక్‌ యూఎస్డీ, కస్పా, ట్రస్ట్‌ వాలెట్‌, సిస్‌కాయిన్‌, ఆర్డీ, బ్లాక్స్‌, బ్రాండ్‌ ప్రొటో లాభపడ్డాయి. టామినెట్‌, డీక్రెడ్‌, సైబర్ హార్పర్‌, స్విప్‌ బార్డ్‌, కాన్వెక్స్‌ సీఆర్వీ, కర్వ్‌ డావో, జోయి తగ్గాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి


క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Embed widget