News
News
X

Cryptocurrency Prices: బడ్జెట్‌ రోజు క్రిప్టో జోష్‌ - రూ.15వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today, 01 February 2023: క్రిప్టో మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.02 శాతం పెరిగింది.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 01 February 2023:

క్రిప్టో మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.02 శాతం పెరిగి రూ.18.89 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.36.40 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.83 శాతం పెరిగి రూ.1,29,560 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.15.58 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.81.96, బైనాన్స్‌ కాయిన్‌ 0.36 శాతం తగ్గి రూ.25,232, రిపుల్‌ 1.45 శాతం పెరిగి రూ.33.25, యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.81.94, బైనాన్స్‌ యూఎస్డీ 0.05 శాతం పెరిగి 81.90, డోజీ కాయిన్ 0.28 శాతం తగ్గి 7.57 వద్ద కొనసాగుతున్నాయి. స్టేటస్‌, డీవైడీఎక్స్‌, బిట్‌గెర్ట్‌, సేఫ్‌పాల్‌, ఇంజెక్టివ్‌, సినాప్సి, కాంటో లాభపడ్డాయి. ఎవర్‌స్కేల్‌, కాన్‌స్టెల్లేషన్‌, ఫ్లోకి, ఆడియస్‌, కీప్‌ నెట్‌వర్క్‌, ఈకాయిన్‌, లియో టోకెన్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి


క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 01 Feb 2023 05:19 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

సంబంధిత కథనాలు

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!

Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!

Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!

Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్‌ ఇచ్చిన బ్యాంకులు

Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్‌ ఇచ్చిన బ్యాంకులు

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల