అన్వేషించండి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నో బూమ్‌! బిట్‌కాయిన్‌ రూ.20వేలు తగ్గెన్‌!

Cryptocurrency Prices Today, 19 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.06 శాతం తగ్గి రూ.15.94 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.30.54 లక్షల కోట్లుగా ఉంది.

Cryptocurrency Prices Today, 19 October 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.06 శాతం తగ్గి రూ.15.94 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.30.54 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.22 శాతం తగ్గి రూ.1,07,866 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.12.98 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.79 శాతం పెరిగి రూ.82.99, యూఎస్‌డీ కాయిన్‌ 0.87 శాతం పెరిగి 83.02, బైనాన్స్‌ కాయిన్‌ 0.02 శాతం పెరిగి రూ.22,522, రిపుల్‌ 2.66 శాతం తగ్గి రూ.37.66, బైనాన్స్‌ యూఎస్‌డీ 0.94 శాతం పెరిగి రూ.83.09 వద్ద కొనసాగుతున్నాయి. లుక్సో, కన్‌ఫ్లక్స్‌, డీసెంట్రలైజ్‌డ్‌ సోషల్‌, జస్ట్‌, రీఫ్‌, బ్యాలెన్సర్‌, ఆవె 4-28 శాతం వరకు లాభపడ్డాయి. అప్టోస్‌, ఫాలా నెట్‌వర్క్‌, పాలీమ్యాథ్‌, ఆంక్రూ, ఎండెక్స్‌, ఎథీరియమ్‌, టెర్రా క్లాసిక్‌ యూఎస్‌డీ 7-42 శాతం మేర పతనమయ్యాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Embed widget