By: ABP Desam | Updated at : 26 Nov 2022 02:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ, ( Image Source : Getty )
Cryptocurrency Prices Today, 26 November 2022:
క్రిప్టో మార్కెట్లు శనివారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.01 శాతం పెరిగి రూ.13.54 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.26.02 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 3.23 శాతం పెరిగి రూ.99,424 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.11.98 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.25 శాతం పెరిగి రూ.81.71, యూఎస్‌డీ కాయిన్ 0.19 శాతం పెరిగి 81.73, బైనాన్స్ కాయిన్ 6.39 శాతం పెరిగి రూ.25,638, రిపుల్ 1.13 శాతం తగ్గి రూ.33.30, బైనాన్స్ యూఎస్‌డీ 0.19 శాతం పెరిగి రూ.81.73 వద్ద కొనసాగుతున్నాయి. రెన్, మాస్క్ నెట్‌వర్క్, హువోబి, రిబ్బన్ ఫైనాన్స్, కెవా, డోజీకాయిన్, సోన్‌బ్రిడ్జి లాభాల్లో ఉన్నాయి. డెజిటరు సుకా, గెయిన్స్ ఫార్మ్, బైనరీ ఎక్స్, ఐవోటెక్స్, ట్రస్ట్ వ్యాలెట్, ఎవ్‌మోస్, నానో నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్ ఫిగర్ చేసిన అదానీ కంపెనీలు
Adani Enterprises: అదానీ పరువు అక్కడ కూడా పోయింది - డో జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్
Adani Group stocks: మరో బిగ్ న్యూస్ - ఇన్వెస్టర్లను కాపాడేందుకు అదానీ స్టాక్స్‌పై NSE నిఘా
Stock Market News: అదానీ షాక్ నుంచి కోలుకుంటున్న మార్కెట్లు - టైటాన్,- ఇండస్ఇండ్ టాప్ గెయినర్స్!
Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!