By: ABP Desam | Updated at : 28 May 2022 02:26 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ
Cryptocurrency Prices Today, 28 May 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్తుబ్ధుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.59 శాతం తగ్గి రూ.23.75 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.42.84 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.90 శాతం తగ్గి రూ.1,45,385 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.16.72 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.82.53, బైనాన్స్ కాయిన్ 1.19 శాతం పెరిగి రూ.24,889, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం పెరిగి 82.58, కర్డానో 1.01 శాతం తగ్గి రూ.37.70, రిపుల్ 2.04 శాతం తగ్గి రూ.31.81 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, కర్వ్ డావో, డోజీకాయిన్, జాస్మీ కాయిన్, రిక్వెస్ట్, పొల్కాడాట్, కైబర్ నెట్‌వర్క్ 3 నుంచి 7 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. నానో, నియో, ఆగ్వర్, సుషి, అంబైర్ యాడెక్స్, ఠీటా ఫ్యూయెల్, వేవ్స్ 3 నుంచి 9 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Multibagger share: 6 నెలల్లో ఈ అదానీ కంపెనీ షేరు కోట్లు కురిపిస్తుందట!
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! 600 + నుంచి 100 - కు సెన్సెన్స్!
Cryptocurrency Prices: జోష్‌లో క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్, ఎథీరియమ్
NPS Scheme: మరో అప్డేట్ ఇచ్చిన ఎన్పీఎస్ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!
ED Raids Chinese Mobile Companies: చైనా మొబైల్ కంపెనీలకు ఈడీ షాకు! 40 ప్రాంతాల్లో సోదాలు
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు