By: ABP Desam | Updated at : 14 May 2022 01:00 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ
Cryptocurrency Prices Today, 14 May 2022: క్రిప్టో మార్కెట్లు నేడు నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.56 శాతం తగ్గి రూ.24.31 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.45.20 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 2.08 శాతం తగ్గి రూ.1,68,731 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.19.74 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.07 శాతం పెరిగి రూ.82.57, బైనాన్స్ కాయిన్ 2.66 శాతం తగ్గి రూ.24,125, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం పెరిగి 82.76, కర్డానో 7.14 శాతం తగ్గి రూ.44.50, రిపుల్ 2.11 శాతం తగ్గి రూ.35.73 వద్ద కొనసాగుతున్నాయి. టెర్రా, డీసెంట్రల్యాండ్, నెమ్, క్వాంట్‌స్టాంప్, పవర్ లెడ్జర్, కైబర్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ కో 9-23 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సుషి, ఫాంటామ్, అపెకాయిన్, డిజికాయిన్, ఫెచ్ ఏఐ, కోటి, యార్న్ ఫైనాన్స్ 8-17 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్ ఇదే!
Bitcoin: ప్రభుత్వాల వద్దే ఇన్ని బిట్కాయిన్లు ఉన్నాయా? ఇక టెస్లా వద్దైతే..!
Cryptocurrency Prices: రోజుకో రూ.10వేలు తగ్గుతున్న బిట్‌కాయిన్! ఎథీరియమ్ మరీ ఘోరం!
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !