By: ABP Desam | Updated at : 26 May 2022 03:06 PM (IST)
క్రిప్టో కరెన్సీ ధరలు
Cryptocurrency Prices Today, 26 May 2022: క్రిప్టో మార్కెట్లు నేడు నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.23 శాతం తగ్గి రూ.23.92 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.43.91 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 6.87 శాతం తగ్గి రూ.1,51,042 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.18.46 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.82.66, బైనాన్స్ కాయిన్ 5.98 శాతం తగ్గి రూ.25,700, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం పెరిగి 82.76, కర్డానో 6.01 శాతం తగ్గి రూ.40.13, రిపుల్ 3.25 శాతం తగ్గి రూ.32.25 వద్ద కొనసాగుతున్నాయి. ది సాండ్‌బాక్స్, స్టేటస్, ట్రాన్, డాయి, ట్రూ యూఎస్‌డీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఎథీరియం నెట్‌వర్క్, అవలాంచె, ఆర్జిన్ ప్రొటో, కాంపౌండ్, ఎన్‌కేఎన్, ఫాంటమ్, కైబర్ నెట్‌వర్క్ 10 నుంచి 16 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
LPG Cylinder Price: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?
Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు
Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!
Delay In Mutual Funds Units: మీ MF యూనిట్లు ఆలస్యంగా క్రెడిట్ అయ్యాయని భయపడుతున్నారా?
Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల