News
News
X

Cryptocurrency Prices: స్వల్పంగా పెరిగిన బిట్‌కాయిన్‌! మిగతావీ అదే బాటలో..!

Cryptocurrency Prices Today, 6 July 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.47 శాతం పెరిగి రూ.16.39 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.29.37 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 

Cryptocurrency Prices Today, 6 July 2022: క్రిప్టో మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.47 శాతం పెరిగి రూ.16.39 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.29.37 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.30 శాతం పెరిగి రూ.92,074 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.10.47 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.81.80, యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం పెరిగి 82.66, బైనాన్స్‌ కాయిన్‌ 2.35 శాతం పెరిగి రూ.19,248, రిపుల్‌ 0.68 శాతం పెరిగి రూ.26.85, కర్డానో 0.02 శాతం పెరిగి రూ.37.87 వద్ద కొనసాగుతున్నాయి. కర్వ్‌డావో, సాండ్‌బాక్స్‌, కైబర్‌ నెట్‌వర్క్‌, అవలాంచె, ఇంటర్నెట్‌ కో, సొలానా, డీసెంట్రల్‌ ల్యాండ్‌ 3-13 శాతం వరకు పెరిగాయి. న్యూమరైర్‌, ఆర్జిన్‌ ప్రొటో, రిక్వెస్ట్‌, అయిలెఫ్‌, స్టేటస్‌, కాంపౌండ్‌, పవర్‌లెడ్జ్‌ 2-6 శాతం వరకు నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Published at : 06 Jul 2022 02:54 PM (IST) Tags: Bitcoin cryptocurrency Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin

సంబంధిత కథనాలు

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Stock Market Opening: 60,000కు మరో 90 పాయింట్లే దూరం! దూకుడు మీదున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Opening: 60,000కు మరో 90 పాయింట్లే దూరం! దూకుడు మీదున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Petrol-Diesel Price, 16 August: ఆగస్టు 15 ఎఫెక్ట్! నేడు అన్ని చోట్లా నిలకడగా ఇంధన ధరలు - నగరాలవారీ రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 16 August: ఆగస్టు 15 ఎఫెక్ట్! నేడు అన్ని చోట్లా నిలకడగా ఇంధన ధరలు - నగరాలవారీ రేట్లు ఇవీ

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

టాప్ స్టోరీస్

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్