By: ABP Desam | Updated at : 01 Jul 2022 03:10 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : André François McKenzie/Unsplash )
Cryptocurrency Prices Today, 1 july 2022: క్రిప్టో మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.47 శాతం పెరిగి రూ.16.22 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.28.22 లక్షల కోట్లుగా ఉంది. ఒకరోజులోనే రూ.2 లక్షల కోట్ల వరకు తగ్గింది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 3.86 శాతం పెరిగి రూ.90,300 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.9.83 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.83.39, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం పెరిగి 83.33, బైనాన్స్ కాయిన్ 7.94 శాతం పెరిగి రూ.18,478, రిపుల్ 3.45 శాతం పెరిగి రూ.26.41, కర్డానో 3.45 శాతం పెరిగి రూ.38.45 వద్ద కొనసాగుతున్నాయి. ఐఎక్స్‌సీ ఆర్‌ఎల్‌సీ, పాలీమ్యాథ్, యూఎంఏ, ది సాండ్‌బాక్స్, అయిలెఫ్, గోలెమ్, బేసిక్ అటెన్షన్ 12-50 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. రిక్వెస్ట్, న్యూమరైర్, ఓక్స్, ఎయిర్‌స్వాప్, లైవ్‌పీర్, లించ్ 1-11 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Nirmala Sitharaman birthday: నిర్మలా సీతారామన్ @ 63! ఆమె గురించి మీకీ విషయాలు తెలుసా!
Stock Market Opening: నో మూమెంటమ్! 60K తర్వాత సెన్సెక్స్ ఏంటని మదుపరి సందేహం?
Petro-Diesel Price, 18 August: పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే!
Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా
Gudivada Amarnath: వంద ఎకరాలు పైబడిన లేఅవుట్ల వద్ద టెక్స్టైల్ పార్కులు, మంత్రి గుడివాడ రివ్యూ
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు