News
News
X

Cryptocurrency Prices On January 6 2022: బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ .. రూ.9 లక్షల కోట్లు హాంఫట్‌!

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 8.53 శాతం తగ్గి రూ.34.57 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.60.15 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 06 January 2022: క్రిప్టో మార్కెట్లు గురువారం బెంబేలెత్తిపోయాయి! ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొనేందుకు క్యూ కడుతున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 8.53 శాతం తగ్గి రూ.34.57 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.60.15 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 12.65 శాతం తగ్గి రూ.2,70,383 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.29.59 లక్షల కోట్లుగా ఉంది. ఈ రెండు కాయిన్ల మార్కెట్‌ విలువ రూ.9 లక్షల కోట్లు హరించుకుపోయింది.

బైనాన్స్‌ కాయిన్‌ 10.21 శాతం తగ్గి రూ.37,440, టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.81.11, సొలానా 13.39 శాతం తగ్గి రూ.12,004, కర్డానో 10.01 శాతం తగ్గి రూ.98, యూఎస్‌డీ కాయిన్‌ 0.09 శాతం పెరిగి 81.13 వద్ద కొనసాగుతున్నాయి. ట్రూ యూఎస్‌డీ, డియా, పాక్స్‌ డాలర్‌, యూఎస్‌డీ కాయిన్‌, టెథర్‌ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌ లెడ్జ్‌, కర్వ్‌ డావో, టెజోస్‌, ఆల్‌రాండ్‌, ఆక్సీ ఇన్ఫినిటీ, లూప్‌రింగ్‌, ఇంటర్నెట్‌ కో 17 నుంచి 19 శాతం వరకు నష్టాల్లో  ఉన్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Published at : 06 Jan 2022 04:13 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin Cryptocurrencies

సంబంధిత కథనాలు

Stock Market News: హమ్మయ్య! పతనం ఆగింది - కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market News: హమ్మయ్య! పతనం ఆగింది - కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ!

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Budget 2023 Picks: బడ్జెట్‌ తర్వాత పెరిగే స్టాక్స్‌ ఇవి, ముందే కొని పెట్టుకోమంటున్న ఎక్స్‌పర్ట్స్‌

Budget 2023 Picks: బడ్జెట్‌ తర్వాత పెరిగే స్టాక్స్‌ ఇవి, ముందే కొని పెట్టుకోమంటున్న ఎక్స్‌పర్ట్స్‌

Cryptocurrency Prices: జోరు మీదున్న క్రిప్టోలు - 2 రోజుల్లో రూ.లక్ష పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: జోరు మీదున్న క్రిప్టోలు - 2 రోజుల్లో రూ.లక్ష పెరిగిన బిట్‌కాయిన్‌

Recurring Deposit: రికరింగ్‌ డిపాజిట్‌లో ఎక్కువ డబ్బు పొందాలంటే ఎలా?

Recurring Deposit: రికరింగ్‌ డిపాజిట్‌లో ఎక్కువ డబ్బు పొందాలంటే ఎలా?

టాప్ స్టోరీస్

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ -  అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్

Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్

Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ