By: ABP Desam | Updated at : 27 Feb 2022 03:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
bitcoin
Cryptocurrency Prices Today, 27 February 2022: క్రిప్టో మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెట్టుబడులు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.58 శాతం పెరిగి రూ.30.92 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.55.91 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.51 శాతం పెరిగి రూ.2,18,665 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.31 శాతం పెరిగి రూ.29,789, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.79.39, కర్డానో 0.33 శాతం తగ్గి రూ.70.45, యూఎస్‌డీ కాయిన్ 0.07 శాతం పెరిగి 79.35, రిపుల్ 2.20 శాతం తగ్గి రూ.59.29 వద్ద కొనసాగుతున్నాయి. క్వాంట్‌స్టాంప్, వేవ్స్, క్వార్క్‌చైన్, ఫైల్‌కాయిన్, డియా, స్వైప్, ఈవోస్ 3 నుంచి 20 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయిలెఫ్, గోలెమ్, క్రోమియా, ఎల్‌రాండ్, మేకర్, సాండ్‌బాక్స్, గాలా 2 నుంచి 6 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Petrol-Diesel Price, 12 August: ఈ నగరంలో నేడు బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? ఇవాల్టి తాజా ధరలు ఇవిగో - నేడు కూడా పెరిగిన ప్లాటినం ధర
కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!
Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?