By: ABP Desam | Updated at : 02 Aug 2022 03:27 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : Getty )
Cryptocurrency Prices Today, 02 August 2022: క్రిప్టో మార్కెట్లు నేడు నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.71 శాతం తగ్గి రూ.18.95 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.34.31 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 6.86 శాతం తగ్గి రూ.1,34,348 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.15.15 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.83.90, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం పెరిగి 85.79, బైనాన్స్ కాయిన్ 3.61 శాతం తగ్గి రూ.23,399, రిపుల్ 3.03 శాతం తగ్గి రూ.31.60, కర్డానో 5.45 శాతం తగ్గి రూ.42.26 వద్ద కొనసాగుతున్నాయి. న్యూమరైర్, చిలిజ్, గాలా, ఠీటా నెట్‌వర్క్, ట్రూ యూఎస్‌డీ 1-19 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఫైల్ కాయిన్, టెర్రా 2.0, ఈఓఎస్, ది గ్రాఫ్, పొల్కా డాట్, ఇంటర్నెట్ కో, బేసిక్ అటెన్షన్ 10-20 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
టాటా నెక్సాన్ ఈవీలో కొత్త మోడల్ - ధర మ్యాక్స్ కంటే తక్కువే!
Syrma SGS Technologies IPO: సిర్మా ఐపీవో అదుర్స్! రూ.48కి పెరిగిన గ్రే మార్కెట్ ప్రీమియం
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో బ్లడ్‌బాత్! బిట్‌కాయిన్ 24 గంటల్లో రూ.2 లక్షలు క్రాష్!
Stock Market Closing: 8 రోజుల లాభాలకు తెర! మళ్లీ 60K కిందకు సెన్సెక్స్!
Paytms Vijay Shekhar Sharma: పేటీఎం సీఈవో కథ కంచికేనా! ఇన్వెస్టర్ల ఓటు ఎటువైపు?
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!