అన్వేషించండి

Tax Rate Hike: సిగరెట్లు, కూల్‌డ్రింక్స్‌, బట్టల రేట్లు పెంపు! - కొత్త ఏడాదిలో పన్ను పోటు

GST Council Meeting: జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి మంత్రుల బృందం వివిధ ఉత్పత్తులపై శ్లాబ్‌ రేట్లను పెంచాలని సిఫార్సు చేసింది. తుది నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకుంటుంది.

GST Rate Hike: కొత్త సంవత్సరంలో సామాన్య జనానికి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇవ్వబోతోంది. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే వివిధ ఉత్పత్తులపై పన్నులు పెంచేందుకు రంగం సిద్ధమైంది, ఫలితంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా.. సిగరెట్లు (Cigarettes), పొగాకు ఉత్పత్తులు (Tobacco Products), శీతల పానీయాల (Cold Drinks) వినియోగం జేబుకు భారంగా మారుతుంది. జీఎస్‌టీ రేట్లను (GST Rates)  హేతుబద్ధీకరించడానికి ఏర్పాటైన మంత్రుల బృందం (Group Of Ministers), ఈ ఉత్పత్తులపై జీఎస్‌టీ రేట్లను పెంచాలని సిఫార్సు చేసింది. ఈ నెల 21వ తేదీన (21 డిసెంబర్ 2024), రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జీఎస్‌టి కౌన్సిల్ (GST Council) 55వ సమావేశం జరుగుతుంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై పన్ను పోటుపై ఆ భేటీలో తుది నిర్ణయం తీసుకోవచ్చు.

సిగరెట్లు, పొగాకుపై టాక్స్‌ రేటు పెంపు!      
రేట్లను హేతుబద్ధీకరించేందుకు, జీఎస్టీ కౌన్సిల్‌, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. పరస్పర అంగీకారం తర్వాత, ఎరేటెడ్ బేవరేజెస్‌ (శీతల పానీయాలు)తో పాటు సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్‌టి రేటును 35 శాతానికి పెంచాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఇది ప్రస్తుతం 28 శాతంగా ఉంది.

మరో ఆసక్తికర కథనం: గుండె జబ్బు చికిత్సల బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ కావడానికి కారణాలివే!, ముందే అలెర్ట్‌ కావడం మంచిది 

దుస్తులు మరింత ఖరీదు!                      
దుస్తులపైనా జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. 1500 రూపాయల వరకు ఉన్న వస్త్రాలపై 5 శాతం జీఎస్‌టీ రేటును GoM కొనసాగించింది. అయితే, రూ. 1500 నుంచి రూ. 10,000 మధ్య ధర ఉన్న వస్త్రాలపై 18 శాతం జీఎస్టీ, రూ. 10 వేల కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రతిపాదించింది. అంటే.. రూ. 10,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే దుస్తులు కూడా లగ్జరీ వస్తువుల కేటగిరీలోకి వస్తాయి. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కమిటీ మొత్తం 148 వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించాలని సూచించింది. జీఎస్టీ రేటు మార్పు ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై సానుకూలంగా ఉంటుందని ఓ అధికారి చెప్పారు.

జీఎస్టీ కౌన్సిల్‌లో తుది నిర్ణయం                   
ప్రస్తుతం, నాలుగు శ్లాబులుగా జీఎస్టీ రేట్లు అమల్లో ఉన్నాయి. అవి.. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ఈ శ్లాబుల్లో ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. మంత్రుల బృందం కొత్తగా 35 శాతం జీఎస్‌టీ రేటును ప్రతిపాదించింది. డిసెంబరు 21న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రుల బృందం సిఫార్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

మరో ఆసక్తికర కథనం: పెరిగిన 24K, 22K పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి తాజా ధరలు ఇవీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Embed widget