అన్వేషించండి

Job In Zomato: జొమాటోలో పెద్ద జాబ్‌ ఆఫర్‌ చేస్తే జనం తిట్టి పోస్తున్నారు, ఇదేందయ్యా?

Deepinder Goyal: జొమాటోలో 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' ఉద్యోగం కోసం నియామక ప్రకటన వెలువడింది. కానీ, కంపెనీ విధించిన ఒక షరతు కారణంగా ఆ కంపెనీ సీఈవోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Zomato CEO Deepinder Goyal: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు తీసుకుని ఆహారాన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి అందించే ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ జొమాటో, తన సంస్థలో ఒక పెద్ద పోస్ట్‌ను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. తన కంపెనీ కోసం 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' కావాలని రాశారు. అయితే, ఈ ఆఫర్‌లో ఒక షరతు ఉంది. 

మొత్తం విషయం ఏంటి?
నవంబర్ 20న, సాయంత్రం 6 గంటల సమయంలో, జోమాటో వ్యవస్థాపకుడు &  సీఈవో దీపిందర్ గోయల్ తనకు 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' అవసరమని తన X అకౌంట్‌లో పోస్ట్ చేసారు. అందులో ఈ ఉద్యోగానికి సంబంధించిన మొత్తం సమాచారం వెల్లడించారు. 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' ఉద్యోగం చేసే అభ్యర్థికి మొదటి ఏడాది జీతం లభించదని అందులో రాసి ఉంది. అంటే, 12 నెలల పాటు జీతం లేకుండా ఉచితంగా పని చేయాలి. స్టోరీ ఇక్కడితో ఐపోలేదు. ఉద్యోగంలో చేరిన వ్యక్తి కంపెనీకి రూ. 20 లక్షలు ఎదురివ్వాలి. 'ఫీడింగ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఆ రూ.20 లక్షలను ఇవ్వాలి. ఇక, రెండో సంవత్సరం నుంచి ఆ ఉద్యోగికి రూ.50 లక్షలకు పైగా వార్షిక వేతనం చెల్లిస్తారు.

ఉద్యోగార్హతలు
ఈ ఉద్యోగానికి ఎలాంటి పూర్వానుభవం అక్కర్లేదని, రెజ్యూమే కూడా పంపాల్సిన అవసరం లేదని దీపిందర్ గోయల్ వెల్లడించారు. అయితే, అభ్యర్థిత్వం గురించి 200 పదాలకు మించకుండా వివరిస్తూ ఒక కవర్‌ లెటర్‌ను d@zomato.comకు పంపాలని దీపిందర్‌ గోయల్‌ సూచించారు. కనీస జ్ఞానం, డౌన్ టు ఎర్త్, సున్నా అర్హత, గ్రేడ్ A కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కావాలి అని X పోస్ట్‌లో జొమాటో సీఈవో రాశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే మనస్తత్వం కలిగి ఉండాలట. జీవితంలో ఎదగాలనే దృఢ సంకల్పంతో ఉండాలట. ఈ అర్హతలు ఉన్న వ్యక్తులు 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని దీపిందర్‌ గోయల్‌ ఆహ్వానించారు. 

ఈ ఉద్యోగం సాధారణ ఉద్యోగాలకు భిన్నంగా ఉంటుందని దీపిందర్ గోయల్ తన పోస్ట్‌లో రాశారు. ఇందులో, సదరు అభ్యర్థి జొమాటో, దాని ఇతర బ్రాండ్‌లైన బ్లింకిట్‌ (Blinkit), హైపర్‌ప్యూర్‌ (Hyperpure), డిస్ట్రిక్ట్‌ (District), స్వచ్ఛంద సంస్థ ఫీడ్‌ ఇండియా (Feeding India) కోసం పని చేయాల్సి ఉంటుంది. 

దీపిందర్ గోయల్‌పై ట్రోలింగ్‌
దీపిందర్‌ గోయల్‌ ఈ పోస్ట్‌ పెట్టిన కాసేపటికే నెట్టింట దీనిపై చర్చ ప్రారంభమైంది. చాలా మంది జొమాటోను, దీపిందర్ గోయల్‌లను ట్రోల్ చేస్తున్నారు. "ఇది చెడ్డ ఆలోచన. జీతం ఇవ్వాలి. 3 నెలల తర్వాత అభ్యర్థి సరైనది కాదని మీరు భావిస్తే, అతను చాలా డబ్బును కోల్పోతాడు, ఇక్కడ నుంచి చేదు అనుభవం తప్ప మరేమీ పొందడు"; "డిప్పీ భాయ్, నన్ను మీ PR మేనేజర్‌గా నియమించుకోండి, భవిష్యత్తులో మీరు ఇలా ట్వీట్ చేయకుండా నేను ఆపగలను"; "ఇది చదివిన తర్వాత, నారాయణమూర్తి కూడా నాకు సాధువుగా కనిపించడం ప్రారంభించారు" అంటూ కామెంట్లు రాశారు. మరికొందరు పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యారు. "సక్సెస్‌ఫుల్‌ ఆంత్రప్రెన్యూర్‌ను దగ్గరి నుంచి చూస్తూ నేర్చుకునే అరుదైన అవకాశం"; "ఇది రియల్‌ ఎంబీఏ" అని రాశారు.

మరో ఆసక్తికర కథనం: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Honda City Hybrid 2026: కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
Embed widget