అన్వేషించండి

Amit Shah: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అమిత్ షా కీలక సూచన- లాభాల్లో ముగిసిన మార్కెట్లు

నేడు దేశంలో నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ గెలుపై ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా మార్కెట్లు ఎన్నికల ఫలితాలతు పుంజుకుంటాయన్నారు

Stock Market: వాస్తవానికి నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఇంట్రాడే ఆరంభం సెషన్లో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం మార్కెట్ల క్లోజింగ్ సమయానికి నష్టాలను అధిగమించి బెంచ్ మార్క్ సూచీలు లాభాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్లను ఉదయం అనుకరించిన భారతీయ ఈక్విటీ మార్కెట్ల సడన్ జంప్ వెనుక కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన ఒక కీలక కారణంగా ఉంది. 

ఈక్విటీ మార్కెట్లపై అమిత్ షా అంచనాలు 
ఇటీవల వరుస సెషన్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగటం, పతనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లపై అమిత్ షా తన అంచనాలను నేడు ప్రకటించారు. జూన్ 4న దేశంలో లోక్ సభ 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో లాభపడతాయని అన్నారు. ఈ లాభాలను ఆస్వాధించేందుకు ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇటీవల ఎన్డీఏ కూటమికి 300 కంటే తక్కువ సీట్లు వస్తాయనే అంచనాల నడుమ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 50 రికార్డు గరిష్ఠాల నుంచి ఏకంగా 4 శాతం పతనమైంది.

మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలతో ముడిపెట్టడం తెలివైన పని కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. బహుశా పతనం కొన్ని పుకార్ల వల్ల కావచ్చని ఎన్డీటీవీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వాస్తవానికి మే 3న నిఫ్టీ సూచీ తన ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. గడచిన ఆరునెలల కాలంలో నిఫ్టీ సూచీ 12 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందగా.. గత ఏడాదిలో దాదాపు 20% పెరిగింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం నమోదవుతున్నప్పటికీ హోం మంత్రి అమిత్ షా మాత్రం భారత స్టాక్ మార్కెట్‌పై ఆశాజనకంగా ఉన్నారు. క్షీణత గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని చెప్పారు.

మూడో సారి సైతం మోదీ ప్రధాని 
దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ల పనితీరు బాగానే ఉంటుందన్న షా.. మూడో సారి సైతం మోదీ ప్రధానిగా వస్తున్నారంటూ బలమైన నమ్మకాన్ని వెల్లడించారు. దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రస్తుతం 7 దశల్లో జరుగుతుండగా.. మూడు ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటివరకు పోలైన 283 సీట్లలో బీజేపీ 190 సీట్లు గెలుచుకుంటుందని షా తన అంచనాలను బయటపెట్టారు. అయితే వాస్తవానికి లోక్ సభ ఎన్నికల్లో ఈసారి తక్కువగా నమోదవుతున్న ఓటింగ్ శాతం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్లలో బేరిష్‌ సెంటిమెంట్లకు దారితీసినట్లు వారు చెబుతున్నారు. 

ఈసారి ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్న అమిత్ షా బీజేపీ ఎన్డీఏ కూటమి 400 కంటే అధిక స్థానాల్లో గెలుస్తుందని తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వాస్తవానికి దేశంలో నాలుగో దశ ఎన్నికలు దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు కొనసాగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాస్తవానికి విదేశీ సంస్థ నోమురా సైతం ఈ సారి ఎన్నికల్లో బీజేపీ తిరిగి గెలుస్తుందని తన అంచనా ప్రకటిస్తూ పాలసీ కొనసాగింపు ఉంటుందని పేర్కొంది. రానున్న ఐదేళ్లలో బీజేపీ సర్కార్ మౌలిక సదుపాయాలపై ఎక్కువ వెచ్చిస్తుందని అలాగే ఉత్పత్తి పెంపుపై ఫోకస్ పెడుతుందని అంచనా వేసింది. దీనికి తోడు మరిన్ని రిఫామ్స్ ఉండొచ్చని వెల్లడించింది. అమిత్ షా ఇచ్చిన ఇంటర్వ్యూతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ రికవరీ కనిపించింది. వాస్తవానికి భారీ నష్టాల్లో కొనసాగిన సూచీలు సాయంత్రానికి లాభాల్లో తమ ప్రయాణాన్ని సానుకూలంగా ముగించాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget