అన్వేషించండి

Pension News: పెన్షనర్లకు మోదీ సర్కార్ గిఫ్ట్- కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్ సేవలు

దేశంలోని పెన్షనర్ల సౌకర్యం కోసం పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ తీసుకొచ్చింది. ఇది పెన్షన్ విధానంలో పారదర్శకతను, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడింది.

Pension Department: మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమ ఈ వార్త. అవును కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 'ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్' రూపొందించింది. ఈ కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ గురించి పూర్తి వివరాలు వెంటనే తెలుసుకోండి.

పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్కచోటికి 
'ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్' 5 రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్కచోటికి తీసుకువస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛనుదారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండే చాలా మంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.

SMS లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం 
ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావటంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా ఉంది. ఇందులో పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత, సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది. ఇది పెన్షనర్‌కు తన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి, వాటిని డిజిలాకర్‌లో సేవ్ చేయటానికి, ఎలక్ట్రానిక్‌గా PPOని జారీ చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తోంది. 

కొత్త పెన్షనర్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ ఫించను సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫారం-16, చెల్లించిన- స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరు. పోర్టల్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే.  

 

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget