By: ABP Desam | Updated at : 01 Feb 2022 04:49 PM (IST)
బడ్జెట్‌పై మోదీ కామెంట్
కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ... బడ్జెట్ 2022ను కొత్త అవకాశాలతో నిండి ఉందని కితాబు ఇచ్చారు.
ఈ బడ్జెట్ మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత వృద్ధి ,మరిన్ని ఉద్యోగాలకు అవకాశం ఇవ్వబోతోంది.
దేశంలో తొలిసారిగా పర్వతమాల వంటి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దీని వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము అండ్ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి. పర్వతప్రాంతాల్లో ఆధునిక ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Speaking on #AatmanirbharBharatKaBudget 2022. https://t.co/vqr6tNskoD
— Narendra Modi (@narendramodi) February 1, 2022
వందేళ్ల భయంకరమైన ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకునేందుకు సానుకూల దృక్పథాన్ని ఇస్తోందీ బడ్జెట్ అన్నారు ప్రధానమంత్రి. సామాన్యుడికి చాలా గొప్ప అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
मैं वित्त मंत्री निर्मला जी और उनकी पूरी टीम को इस People Friendly और Progressive बजट के लिए बहुत-बहुत बधाई देता हूं: PM @narendramodi #AatmanirbharBharatKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2022
ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమం కోసం ప్రధాన ప్రాధాన్యత ఇచ్చాం. పేదలకు పక్కా ఇళ్లు, నల్లా నీళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కెనక్షన్ ఇవ్వడానికి ఈ బడ్జెట్‌లో తగిన ప్రయారిటీ ఇచ్చాం. - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
గంగా ప్రక్షాళన, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమైన చర్య తీసుకున్నాం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా తీరం వెంబడి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
इस बजट में क्रेडिट गारंटी में रिकॉर्ड वृद्धि के साथ ही कई अन्य योजनाओं का ऐलान किया गया है।
— PMO India (@PMOIndia) February 1, 2022
डिफेंस के कैपिटल बजट का 68 परसेंट डोमेस्टिक इंडस्ट्री को रिजर्व करने का भी बड़ा लाभ, भारत के MSME सेक्टर को मिलेगा: PM @narendramodi #AatmanirbharBharatKaBudget
క్రెడిట్ గ్యారెంటీలో రికార్డు పెంపుదలతోపాటు ఇతర పథకాలు కూడా ప్రకటించామన్నారు ప్రధాని. డిఫెన్స్ క్యాపిటల్ బడ్జెట్‌లో 68శాతం దేశీయ పరిశ్రమలకు కేటాయించడం వల్ల ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు.
పీపుల్ ఫ్రెండ్లీ అండ్ ప్రగతిశీలక బడ్జెట్ సభ ముందుకు తీసుకొచ్చిన ఆర్థికమంత్రి సీతారామన్, ఆర్థికమంత్రిత్వ శాఖ బృందానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
Crypto Tax India: క్రిప్టో బిల్లుకు లోక్ సభ ఆమోదం, ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలు
AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!
AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి
AP Budget 2022 : నేడే ఏపీ బడ్జెట్, ఎన్నో సవాళ్లు - అభివృద్ధా? సంక్షేమమా?
Telangana budget 2022-23: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్ తీపి కబురు
Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల
Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి
Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్
Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్