Karnataka state Budget: సంక్షేమ పథకాలకే అధిక కేటాయింపులు, రూ.2.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కర్ణాటక

కర్ణాటక బడ్జెట్ ను సీఎం బసవరాజ్ బొమ్మై ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,65,720 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

FOLLOW US: 

కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ 2022-23 ను ప్రవేశపెట్టింది. రూ. 2,65,720 కోట్ల బడ్జెట్ ను సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాల్లో కేటాయింపులు పెంచుతున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు. అలాగే బెంగళూరు నగరానికి మేకేదాటు నీటి పథకానికి రూ.1000 కోట్లు కేటాయించారు.

కర్ణాటక బడ్జెట్ 2022-23: 

 • 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 76,743 జీఎస్టీ వసూళ్ల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది.
 • 2022-23 సంవత్సరానికి వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయ సేకరణ లక్ష్యం రూ.77,010 కోట్లుగా నిర్ణయించింది.
 • మొత్తం వసూళ్లు రూ.2.61 లక్షల కోట్లుగా అంచనా వేసింది. 
 • ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.2.65 లక్షల కోట్లు
 • రెవెన్యూ లోటు రూ. 14,699 కోట్లు, ఆర్థిక లోటు రూ. 61,564 కోట్లుగా అంచనా వేసింది. ఇది GSDPలో 3.26%.
 • 2022-23 చివరి నాటికి మొత్తం వ్యయాలను రూ. 5.18 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇది GSDPలో 27.49%.
 • ఎక్సైజ్ శాఖకు రూ.29,000 కోట్లు, రవాణా శాఖకు రూ.8,007 కోట్లు కేటాయించింది. 
 • 2022-23 ఆర్థిక సంవత్సరానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,000 కోట్ల ఆదాయ సేకరణ లక్ష్యం నిర్దేశించింది. 
 • పరిపాలనా సంస్కరణలు, ప్రభుత్వ సేవల రంగానికి రూ.56,710 కోట్లు కేటాయించారు
 • ఇ-గవర్నెన్స్ ద్వారా సేవల పంపిణీని ప్రోత్సహించడానికి IIIT-బెంగళూరు భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ ఏర్పాటుచేయనున్నారు
 • కన్నడ సినిమాలకు ప్రభుత్వ సబ్సిడీలను 125 నుంచి 200కి పెంచనుంది.
 • దేవనహళ్లి, కోలార్, హోస్పేట్, గడగ్, బళ్లారి, విజయపుర, భాల్కీ, యాద్గిర్, దావణగెరెలో రూ. 80 కోట్లతో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.
 • 30,000 కన్నా ఎక్కువ త్రైమాసిక పన్నులు చెల్లించే వాహనాలకు నెలవారీ ప్రాతిపదికన పన్ను చెల్లించే సౌకర్యం కల్పించారు

కర్నాటక బడ్జెట్ 2022: కర్ణాటక బుగెట్ సంస్కృతి, వారసత్వం సహజ వనరుల పరిరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక కళాగ్రామాన్ని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తామని సీఎం బొమ్మై తెలిపారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో "ఆరేభాష" పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  రాష్ట్ర స్మారక చిహ్నాలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి 'స్మారక చిహ్నాన్ని స్వీకరించండి' పథకం ప్రవేశపెట్టనున్నారు. టూరిస్ట్ గైడ్‌లకు ప్రోత్సాహకాలకు నెలకు రూ. 2,000 కోట్లు కేటాయించారు. సముద్రతీర ప్రాంతాలలో నీటి వనరులను కలుషితం కాకుండా, ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంకు సహాయంతో రూ. 840 కోట్లతో అటవీ వ్యవస్థలపై సృష్టించిన ప్రతికూల ప్రభావాలను భర్తీ చేయడానికి రూ. 100 కోట్ల పర్యావరణ-బడ్జెట్ 'బ్లూ-ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ స్కీమ్' ఏర్పాటుచేయనున్నారు. తీర్థయాత్ర కేంద్రాలకు పర్యటనలను సులభతరం చేయడానికి కేఎస్టీడీటీ "పవిత్ర యాత్ర" కార్యక్రమం ప్రవేశపెట్టనున్నారు. 30,000 మంది కాశీ యాత్రికులు ఒక్కొక్కరికి రూ. 5,000 సబ్సిడీని ప్రకటించారు.  

 • వ్యవసాయ యంత్రాల వినియోగం: ఇంధన వ్యయ భారాన్ని తగ్గించడానికి, రాష్ట్ర డీజిల్ సబ్సిడీని ఎకరాకు రూ. 250 చొప్పున అందించేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టనున్నారు. దీని కోసం రూ.500 కోట్లు కేటాయించారు.
 • పుణ్య కోటి దత్తు యోజన : ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఏటా రూ.11,000 రూపాయలు చెల్లించి గోశాలలోని గోవులను దత్తత తీసుకునేలా ప్రోత్సహించడం.
 • ప్రధాన నగరాల్లో నమ్మ క్లినిక్‌లు: బెంగళూరులోని అన్ని వార్డుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ క్లినిక్‌లలో నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులను గుర్తించడం, చికిత్స నిపుణులకు రిఫర్ చేయడం వంటి సేవలు అందిస్తారు.
 • మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బెంగుళూరు తాగునీటి ప్రాజెక్ట్: కేంద్ర ప్రభుత్వం అనుమతులతో వీటిని అమలు చేస్తారు. ఈ ఏడాది రూ.1,000 కోట్ల గ్రాంట్‌ను అందించనున్నారు. 
 • NEET కోచింగ్: పేద పిల్లలకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడానికి రాష్ట్రంలోని అన్ని తాలూకాలలో నీట్ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తారు.  
 • భాష, సంస్కృతి: భాష, సంస్కృతిని ప్రోత్సహించడానికి హవేరిలో అఖిల భారత కన్నడ సాహిత్య సభను నిర్వహించడానికి సుమారు రూ.20 కోట్లు కేటాయించారు. 
 • మహిళా రిజర్వ్ పోలీస్: రాష్ట్రంలో కొత్త మహిళా కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీస్ కంపెనీ ప్రారంభిస్తారు.
 • జైళ్లలో భద్రత: మొబైల్‌ల వినియోగాన్ని నిరోధించడానికి, తనిఖీలు చేయడానికి జైళ్లలో అత్యాధునిక పరికరాలు మొబైల్ జామర్‌లను ఏర్పాటు చేయనున్నారు.
 • విమానాశ్రయాలు, హెలిపోర్టులు: రాయచూర్‌లోని విమానాశ్రయాన్ని రూ.186 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంగా మార్చనున్నారు. దావణగెరె, కొప్పల్‌ జిల్లాల్లోని విమానాశ్రయాలకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికను కూడా రూపొందించనున్నారు. మైసూరు విమానాశ్రయంలోని రన్‌వేను పొడిగించడంతోపాటు మడికేరి, చిక్కమగళూరు, హంపీలలో హెలిపోర్టులను ఏర్పాటు చేస్తారు.
Published at : 04 Mar 2022 08:37 PM (IST) Tags: karnataka budget 2022-23 Karnataka budget

సంబంధిత కథనాలు

Crypto Tax India: క్రిప్టో బిల్లుకు లోక్ సభ ఆమోదం, ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలు

Crypto Tax India: క్రిప్టో బిల్లుకు లోక్ సభ ఆమోదం, ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలు

AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!

AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!

AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి

AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి

AP Budget 2022 : నేడే ఏపీ బడ్జెట్, ఎన్నో సవాళ్లు - అభివృద్ధా? సంక్షేమమా?

AP Budget 2022 : నేడే ఏపీ బడ్జెట్, ఎన్నో సవాళ్లు - అభివృద్ధా? సంక్షేమమా?

Telangana budget 2022-23: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్‌ తీపి కబురు

Telangana budget 2022-23: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్‌ తీపి కబురు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?

Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు

Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు