అన్వేషించండి

Budget Reaction : కొత్త ఇన్నోవేషన్‌లను ప్రోత్సాహించేలా కేంద్ర బడ్జెట్ - నిర్మలమ్మ పద్దుపై వ్యాపారవర్గాల స్పందన

Union Budget 2024 :కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో దేశంలో అన్ని వ్యాపారాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Budget 2024  Business community  Reaction :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌పై వ్యాపారవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నయి. పలువురు వ్యాపార ప్రముఖులు బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. మౌలిక సదుపాయాల రంగానికి పెద్ద పీట వేయడంతో  ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెబుతున్నారు. 

 
సమ్మిళిత వృద్ధికి అవకాశం ఇచ్చే బడ్జెట్ : సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్
 
సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యమిచ్చే  సమతుల్య బడ్జెట్ అని సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్ ప్రసంసించారు.  పరిశ్రమలు, వాణిజ్యం  వృద్ధి చెందుతున్న కొద్దీ ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి కీలకం అవుతాయన్నారు.  విద్య, నైపుణ్య మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనకు రూ.1.48 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.  రియల్ ఎస్టేట్ రంగానికి కూడా  నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం ఉంటుందని  ప్రభుత్వ చొరవ వల్ల స్కిల్డ్ లేబర్ సమస్య తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు, పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ల కోసం కేటాయించిన రూ.10 లక్షల కోట్లతో సహా గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం గృహనిర్మాణ అవకాశాలను పెంచుతుందన్నారు.  మహిళలకు స్టాంప్ డ్యూటీని తగ్గించడం గృహ యాజమాన్య ఆకాంక్ష తీర్చుకునే వారికి మరింత మద్దతుగా ఉంటుందన్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరిని సత్వ గ్రూప్ ఎండీ ప్రశంసించారు. 

ఇన్నోవేషన్‌లను ప్రోత్సహించేలా బడ్జెట్ : టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు 

 “కొత్త ఇన్నోవేషన్‌లను ప్రోత్సాహించే విధంగా 2024 బడ్జెట్‌లో  కీలక మైలురాయి పడిందని టీ హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇండియన్‌ స్టార్టప్‌ ఇకో సిస్టమ్‌లో సుస్థిర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల పెట్టుబడిదారులకు విధించే ఏంజెల్ పన్ను రద్దు అనేది ఒక కీలకమైన చర్య అని ఆయన అన్నారు. ఇది నూతన ఆవిష్కరణలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ టాక్స్‌ రద్దు అనేది స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడానికి మార్గం సుగమం చేయడంలో ఇది కీలక అడుగు అని టీ హబ్‌ సీఈవో మహంకాళి అభిప్రాయపడ్డారు. అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడిన ₹ 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం మరొక ముందడుగు వేసే ప్రయత్నంగా ఆయన చెప్పారు. ఈ గణనీయమైన పెట్టుబడి వినూత్న స్టార్టప్‌లు మరియు సంచలనాత్మక పరిశోధనలకు మద్దతు ఇవ్వడం ద్వారా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని ప్రోత్సహిస్తుందని వివరించారు. అంతరిక్ష సాంకేతికత మరియు రీసెర్చ్‌లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు దోహద పడుతుందన్నారు.

అంతేకాకుండా, ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ కింద రూ.1 లక్ష కోట్ల ఫైనాన్సింగ్ పూల్‌ను ప్రవేశపెట్టడం ఒక గేమ్-ఛేంజర్ నిర్ణయంగా ఆయన చెప్పారు. ఈ ఫండ్ ప్రాథమిక పరిశోధన మరియు ప్రోటోటైప్ అభివృద్ధికి సహాయపడుతుందని ‌అన్నారు. వాణిజ్య-స్థాయి ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు మరియు మార్కెట్‌కు అత్యాధునిక పరిష్కారాలను తీసుకురావడానికి స్టార్టప్‌లను అనుమతిస్తుందని వివరించారు.

బడ్జెట్‌లోని కీలక ప్రకటనలు శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై  సానుకూల ప్రభావం చూపించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు స్టార్టప్‌లకు అవసరమైన వనరులను అందిస్తాయి మరియు అభివృద్ధి చెందడానికి, ఆవిష్కరణలు చేయడానికి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధి మరియు సాంకేతిక పురోగతికి గణనీయంగా దోహదపడతాయని టీ హబ్ సీఈవో విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget