Warren Buffet: భారత స్టాక్ మార్కెట్లపై వారెన్ బఫెట్ కీలక కామెంట్స్, ఏం చెప్పారంటే?
అమెరికా బిలియనీర్ ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ భారత స్టాక్ మార్కెట్లపై కీలక కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఇండియాలో పెట్టుబడుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Indian Stock Markets: ప్రపంచ మార్కెట్లలో బిగ్‌బుల్ వారెన్ బఫెట్. పైగా ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. బిలియనీర్ వారెన్ బఫెట్ నిన్న తన కంపెనీ బర్క్‌షైర్ హాత్వే ఇన్వెస్టర్ల సమావేశానికి హాజరయ్యారు. 90 ఏళ్లు దాటిన ఆయన వచ్చే ఏడాది సైతం తాను ఖచ్చితంగా సమావేశానికి వస్తానని చెప్పారు. అయితే తన ప్రాణమిత్రుడు మరణించిన తర్వాత తొలిసారిగా ఒంటరిగా రావటం గమనార్హం.
ఈ క్రమంలో బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ భారత స్టాక్ మార్కెట్ల గురించి సానుకూల ధృక్పదాన్ని వెల్లడించారు. ఇండియన్ మార్కెట్లలో కనుగొనబడని పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని బులిష్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఈ పెట్టుబడి అవకాశాలను తన గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే తప్పక అన్వేషిస్తుందని వెల్లడించారు. అన్వేషణతో ఉత్తమపెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం బెర్క్‌షైర్ వార్షిక సమావేశంలో బఫెట్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి భారతదేశ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూఎస్ ఆధారిత హెడ్జ్ ఫండ్ విజనరీ అడ్వైజర్స్‌కు చెందిన రాజీవ్ అగర్వాల్ ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో బెర్క్‌షైర్ ను పెట్టుబడి అవకాశాల గురించి అడిగిన ప్రశ్నకు బఫెట్ స్పందిస్తూ పై కామెంట్స్ చేశారు.
రాజీవ్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బఫెట్ ఇది చాలా మంది ప్రశ్న అని అన్నారు. ఇండియా వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా అవకాశాలు ఉన్నాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నట్లు బెర్క్‌షైర్ హాత్వే సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ CEO అన్నారు. అయితే భారతదేశంలో ఆ వ్యాపారాల గురించి మనకు ఏమైనా అవగాహన లేదా అంతర్దృష్టి ఉందా అనేది ప్రశ్న బెర్క్‌షైర్‌లో మరింత శక్తివంతమైన నిర్వహణ దానిని ముందుకు తీసుకెళ్లగలదన్నారు. ప్రపంచవ్యాప్తంగా బెర్క్‌షైర్‌కు చాలా ఉన్నతమైన ఖ్యాతి ఉందని బఫెట్(93) అన్నారు. జపాన్‌లో పెట్టుబడులకు సంబంధించి తనకున్న అనుభవం ఆసక్తికరమైనదని అన్నారు. ఇక భారత మార్కెట్ల విషయంలో గుర్తించని లేదా పట్టించుకోని పెట్టుబడి అవకాశాలు భవిష్యత్తులో బయటపడొచ్చన్నారు.
బెర్క్‌షైర్ హాత్వే తీసుకున్న కొన్ని ప్రధాన పెట్టుబడి నిర్ణయాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు బఫ్ఫెట్ ఇటీవల సమాధానమిచ్చారు. ఆపిల్‌లో వాటాను తగ్గించడానికి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. స్టాక్ కోసం దీర్ఘకాలిక దృక్పథంపై ఎటువంటి ప్రభావం చూపదని, ఇటీవల తిరోగమనం ఉన్నప్పటికీ ఆపిల్ తన అతిపెద్ద హోల్డింగ్‌లలో ఒకటిగా ఉంటుందని వారెన్ బఫెట్ స్పష్టం చేశారు.
భారత స్టాక్ మార్కెట్లపై బఫెట్ చేసిన తాజా పాజిటివ్ కామెంట్స్ ప్రభావం సోమవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతిబింబించే అవకాశం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా కొనసాగుతున్నప్పటికీ మంచి వృద్ధిని సాధిస్తూ చీకటిలో వెలుగులాగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న వేళ బఫెట్ మాటలు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుందని వారు చెబుతున్నారు.