అమెజాన్- ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్‌లో 25వేలలోపు మొబైల్స్‌పై ఉత్తమ డీల్స్- ఆల్‌రౌండర్ ఫోన్‌లపై బిగ్ ఆఫర్
Amazon-Flipkart Festive Sale:అమెజాన్- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డీల్స్ నడుస్తున్నాయి. ఇందులో మొబైల్స్‌పై ఎక్కువ ఆఫర్స్ నడుస్తున్నాయి. 25 వేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్‌లపై ఉన్న ఆఫర్స్ చూద్దాం.

Amazon-Flipkart Festive Sale: దసరా సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిగ్‌సేల్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇందులో ఎక్కువ మొబైల్స్‌పై ఉన్నాయి. భారీ సంఖ్యలో కొనుగోలుదారులు మొబైల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పటికే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఆఫర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తక్కువ ధరకు లభించే మొబైల్స్‌పై ఉన్న ఆఫర్స్ గురించి ఇక్కడ చూద్దాం.
సాధారణ వినియోగదారులకు, గేమర్‌లకు పదివేల నుంచి 35వేల విభాగంలో భారీ ఆఫర్స్ ప్రకటించాయి. ఈ సేల్స్ అద్భుతమైన విలువ అందిస్తున్నాయి. ఫ్లాంగ్‌ఫిష్ కిల్లర్స్‌గా పేరున్న కొన్ని మోడల్స్ బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి మీరు ఎప్పుడూ చూడని ధరలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ధరలు ఎప్పుడైనా మారవచ్చు. లేదా ఆఫర్‌లు ధరలు పెరగవచ్చు. త్వరగానే బుక్ చేసుకోవడం ఉత్తమం.
25 వేల లోపు ధర కలిగిన గేమింగ్,ఫెర్ఫార్మెన్స్ ఫోన్
గేమింగ్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని ఐక్యూ ఈ సేల్‌లో అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.
ఐక్యూ నియో 10R: ఈ ఫోన్ సాధారణంగా పాతికవేల కంటే ఎక్కువ ధరకే మార్కెట్ ఉంటూ వచ్చింది. ఇప్పుడు 256జీబీ వేరియెంట్ 24వేలకి లభిస్తోంది. ఇది బేస్‌మోడల్ కంటే మెరుగైంది.
ప్రత్యేకతలు: ఈ ధర పరిధిలో గేమింగ్ కోసం దీనిని ఉత్తమమైన ఫోన్‌గా పరిగణిస్తున్నారు. 256 జీబీ వేరియెంట్ UFS4.1స్టోరేజ్‌తో వస్తుంది. ఇది గేమ్స్‌ను మరింత ఆసక్తిగా మారుస్తుంది.
బేస్ వేరియెంట్(128GB) ఇది 23వేలకి అందుబాటులో ఉంది.
మోటో ఏ 60 ప్రో/ఎడ్జ్ 6ప్రో: ఈ మోట్రోలా ఫోన్ 30వేల వద్ద లాంచ్ అయినప్పటికీ బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి పాతిక వేలలోపు అందుబాటులో ఉంది. ఇది UFS 4.0 స్టోరేజ్, IP68 రేటింగ్, మంచి కెమెరాలు, సమర్థమంతమైన పర్ఫార్మెన్స్ కారణంగా హైలైట్ అవుతుంది.
నథింగ్ ఫోన్ 3Aప్రో: నథింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణంగా 32వేల వద్ద లాంచ్ అయ్యింది. కానీ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఆఫర్లను కలుపుకొని సుమారు పాతికవేల వద్ద లభిస్తోంది. ఇది క్లీన్ యూఐ, ఆకర్షిణీయమైన లుక్‌తో మంచి ఆల్‌రౌండర్ ప్యాకేజీ.
ఆల్ రౌండర్ ఎక్స్‌పీరియన్స్: వన్ ప్లస్ డీల్స్
వన్ ప్లస్ ఫోన్‌లకు బ్రాండ్‌వాల్యూ మంచి యూఐ, సాప్ట్‌వేర్ అనుభవం కోరుకునే వారికి ఈ డీల్స్ ప్రయోజకరంగా ఉంటాయి.
వన్‌ప్లస్ నార్డ్‌సీఈ5: ఈ మోడల్ సేల్‌లో 21, 749కి లభిస్తోంది. ఇది 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ AMOLED స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8350EX ప్రాసెసర్‌తో వస్తుంది.
90FPS గేమింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. 7100mAh భారీ బ్యాటరీ, 80W సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకత.
వన్ ప్లస్ నార్డ్ 5: ఆల్‌రౌండర్ యూజర్ల కోసం ఉత్తమమైనది. విత్ అవుట్ బ్యాంక్ ఆఫర్ ధర 30,500. బ్యాంక్ డిస్కౌంట్‌తో ఇది 28వేలకే లభిస్తోంది.
బడ్జెట్‌సూపర్ డీల్స్: 15000లోపు ఎంపికలు
అమెజాన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులై 10శాతం డిస్కౌంట్ ద్వారా ఈ బడ్జెట్ ఫోన్‌లపై మరింత తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం36 5జీ: పదిహేను వేల లోపు శాంసంగ్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక కావచ్చు. దీని ధర 14వేలకి అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఫుల్ హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఉంది. అత్యంత ముఖ్యంగా ఈ ఫోన్‌కు ఆరేళ్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లభిస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలతో 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు.
ఐక్యూ జీ10ఆర్: ప్రీమియం లుక్‌ను కోరుకునే స్టూడెంట్స్‌కి ఈ ఫోన్ ప్రత్యేకంగా తీసుకువచ్చారు. దీని ప్రభావంతమైన ధర 17వేల 500 వద్ద ఉంది.
ఫీచర్లు: క్వాడ్ కర్డ్వ్ డిస్‌ప్లే,5700mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, P68/69 రేటింగ్ , OIla 50M మెయిన్ కెమెరా దీని ప్రత్యేకత.
రెడ్‌మీ 13 ప్రో: 11,200 దగ్గర 8జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్‌తో లభిస్తోంది. ఇందులో 108ఎంపీ కెమెరా, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4జెన్ 2 ప్రాసెసర్ ఉన్నాయి.
రెడ్‌మీ ఏ4: దీని ధర 7,500. 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇది హెడ్‌డీ+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది.
వివిధ ధరల విభాగాలలో అందుబాటులో ఉన్న డీల్స్ అన్నీ బ్యాంకు ఆఫర్లు జోడించి తర్వాతే లభించే ధరలు కాబట్టి వినియోగదారులు తమకు నచ్చిన ఫోన్‌ను ఎంచుకుని ఆఫర్‌లు ముగియక ముందే కొనుగోలు చేయాలి.





















