By: ABP Desam | Updated at : 24 Jan 2023 09:43 AM (IST)
Edited By: Arunmali
అంచనాలను బీట్ చేసిన యాక్సిస్ బ్యాంక్
Axis Bank Q3 Results: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ కూడా బ్రహ్మాండమైన నంబర్లను ప్రకటించింది. ఆ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 62% పెరిగి రూ. 5,853 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ రూ. 5,500 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని మార్కెట్ అంచనా వేస్తే, అంతకంటే ఎక్కువే సంపాదించింది.
ఈ రుణదాత కేటాయింపులు (Provisions) పెరిగినప్పటికీ, నికర లాభం పెరగడం విశేషం.
నికర వడ్డీ ఆదాయం (NII) 32.4% వృద్ధితో రూ. 11,459 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం అంటే.. ఇచ్చిన రుణాల మీద సంపాదించిన వడ్డీ - స్వీకరించిన డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీ మధ్య వ్యత్యాసం.
మెరుగుపడిన ఆస్తి నాణ్యత (Axis Bank Asset Quality)
2021 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చినా (YoY), 2022 సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చినా (QoQ).. 2022 డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. మొత్తం రుణాల శాతంలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (Gross non-performing assets ratio) ఏడాది క్రితం ఉన్న 3.17%, క్రితం త్రైమాసికంలో ఉన్న 2.50% కంటే తగ్గి 2.38%గా నమోదైంది. నిరర్థక ఆస్తులు ఎంత తగ్గితే, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి అంత మెరుగుపడ్డట్లు లెక్కించాలి.
మొత్తం రుణాల శాతంలో నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి ఏడాది క్రితం నాటి 0.91%తో పోల్చినా, క్రితం త్రైమాసికంలోని 0.51%తో పోల్చినా ఇప్పుడు 0.47%కు తగ్గింది.
మొత్తం రుణాల్లో శాతంలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి ఏడాది క్రితం 3.17% మరియు త్రైమాసికం క్రితం 2.50% నుండి 2.38%కి తగ్గింది.
మొత్తం రుణాల్లో నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి ఏడాది క్రితం 0.91%గా, త్రైమాసికం క్రితం 0.51%గా ఉంటే.. ఇప్పుడు 0.47%కి పడిపోయింది.
పెరిగిన కేటాయింపులు
బ్యాంక్ మొండి బకాయిలు తగ్గినా, వాటి కోసం చేసిన కేటాయింపులు రూ. 550 కోట్ల నుంచి రూ. 1,437.73 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ ఫలితాల్లో నెగెటివ్‌గా చూడాల్సిన విషయం ఇది.
డిసెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 73 బేసిస్ పాయింట్లు YoY, 30 బేసిస్ పాయింట్లు QoQ మెరుగుపడి 4.26%కి చేరుకుంది.
ఫీజు ఆదాయం 23% YoY, 6% QoQ పెరిగింది. రిటైల్ ఫీజ్ 30% YoY, 8% QoQ పెరిగింది.
క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లలో వృద్ధి కారణంగా రిటైల్ రుణాలు 17% పెరిగాయి.
డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ, పెరుగుదల వేగం మాత్రం తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 14% పెరుగుదలతో పోలిస్తే, డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ ఖర్చులు 8% YoY పెరిగాయి. ఇది మరొక సానుకూలాంశం.
బ్యాంక్ స్వీకరించే డిపాజిట్ల వృద్ధి రేటు 9 శాతంతో నెమ్మదించింది. ఇది నెగెటివ్ ఫ్యాక్టర్.
యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర గత ఆరు నెలల్లో రిటైల్ రుణాలు 27%, గత ఏడాది కాలంలో 31% పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం
ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు, "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" రికార్డ్ ఇది
LIC WhatsApp Services: 11 రకాల ఎల్ఐసీ సేవల్ని వాట్సాప్ నుంచే పొందొచ్చు, మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు
Credit Card Charges: అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్
Income Tax New Rules: పాత-కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!