IT Notice: ఇష్టం వచ్చినట్టు నగదు లావాదేవీలు చేస్తున్నారా ? అయితే మీకు ఐటీ నోటీసులే!
నగదు లావాదేవీలకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాంటి లావాదేవీలు చేస్తే నోటీసులు వస్తాయో తెలుసా?
నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఐటీ శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచ్ వల్ ఫండ్ సంస్థలు, బ్యాంకు, బ్రోకరేజీ లాంటి వివిధ ఇన్వెస్టిమెంట్ ప్లాట్ ఫామ్ లకు సంబంధించిన నిబంధనలు కఠినమయ్యాయి. కాబట్టి నగదు లావాదేవీలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటితే.. ఐటీ శాఖ నుంచే నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. నిబంధనలు పాటిస్తే మంచిది.
అధిక నగదు లావాదేవీలు జరిపే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్లో నగదును ఉపయోగించి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పెట్టుబడి పెట్టాడు అనుకోండి. బ్రోకర్ తన బ్యాలెన్స్ షీట్‌లో పెట్టుబడి గురించి నివేదిస్తాడు. అక్కడ లావాదేవీ విషయం తెలిసిపోతుంది కదా. అందుకే నగదు లావాదేవీల పరిమితిని తెలుసుకుని వ్యవహరిస్తే ఎలాంటి నోటీసులు రావు.
- క్రెడిట్ కార్డు ఉంది కదా అని.. ఇష్టం వచ్చినట్టు వాడతాం. బిల్లు చెల్లించేటప్పుడు రూ.లక్ష మించొద్దు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేటప్పుడు.. నగదు పరిమితి మించితే.. అంతే నోటీసులు వస్తాయి.
- పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి లక్ష వరకూ ఉంది. ఒకవేళ లక్షకు మించి డబ్బులను జమ చేస్తే.. ఐటీ శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంది. అంతేకాదు.. కరెంట్ ఖాతాదారులకు పరిమిది రూ.50 లక్షలుగా ఉంది. ఈ పరిమితి దాటి డబ్బు జమచేస్తే.. ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి.
- మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు ఎంత పడితే అంత పెట్టడం మంచిది కాదు. ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు నగదు పెట్టుబడిగా రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూసుకోవాలి. పరిమితిని మించితే ఐటీ శాఖ మీ చివరి ఐటీఆర్ తనిఖీ చేస్తుంది.
- బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో నగదు డిపాజిట్ రూ. లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంతకుమించి నగదు డిపాజిట్ చేయకూడదు.
- ఒక ఆస్తిని కొనేటప్పుడు... అమ్మేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 లక్షల పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి నగదు లావాదేవీలు చేయడాన్ని ఐటీ శాఖ ప్రోత్సహించదు.
పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే ఐటీ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. పెరిగిన టెక్నాలజీతో మనం చేసే లావాదేవీలు ఈజీగా తెలిసిపోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు ఉన్న నిబంధనలు ఇప్పుడు లేవు. గతంలో కంటే ఇప్పుడు నిబంధనల్లో ఎన్నో మార్పులు జరిగాయి. నిబంధనలు మరింత కఠినతరం చేశారు.
Also Read: RBI SALARIES: సెలవు రోజుల్లో కూడా జీతాలు, పింఛన్ డబ్బులు... ఆర్బీఐ శుభవార్త