Stocks To Watch: సోమవారం ఇన్వెస్టర్లు గమనించాల్సిన బ్యాంకింగ్, FMCG స్టాక్స్ ఇవే
Share Market: క్యూ1 ఫలితాలపై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 23 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బుల్ ర్యాలీ కొనసాగుతోంది.
Trending Stocks: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. అలాగే క్యూ1 ఫలితాలపై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 23 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బుల్ ర్యాలీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో జోరు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు నేడు దృష్టి సారించాల్సిన కొన్ని షేర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండస్‌ఇండ్ బ్యాంక్: ప్రైవేటు బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బ్యాంక్ అడ్వాన్స్‌లలో ఏడాది ప్రాతిపదికన 16% వృద్ధి సాధించింది. ఈ క్రమంలో డిపాజిట్లు 15% పెరగగా.. ఈ కాలంలో CASA నిష్పత్తి గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గి 36.7%గా నమోదైంది.
టైటాన్: జూన్ త్రైమాసికంలో కంపెనీ దేశీయ ఆభరణాల వ్యాపారంలో 8% వృద్ధి నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం వృద్ధి 9%గా ఉంది. గతేడాదితో పోలిస్తే వాచ్‌లు, వియరబుల్స్ వ్యాపారంలో 15 శాతం వృద్ధిని టైటాన్ సాధఇంచింది.
మారికో: కన్సాలిడేటెడ్ రాబడులు అత్యధిక సింగిల్ డిజిట్‌లలో ఉన్నాయి. మిగిలిన సంవత్సరంలో కూడా పైకి ట్రెండ్ కొనసాగుతుందని అంచనా. కంపెనీ స్థూల మార్జిన్ కూడా వార్షిక ప్రాతిపదికన మెరుగ్గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
డాబర్: త్రైమాసిక ప్రాతిపదికన డిమాండ్ మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. రాబోయే నెలల్లో మరింత మెరుగుదల కనిపించవచ్చు. కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి అత్యధిక సింగిల్ డిజిట్‌లో ఉంటుందని అంచనా వేయబడింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: జూన్ త్రైమాసికంలో దేశీయ అడ్వాన్సులు గతేడాదితో పోలిస్తే 8.5% పెరిగాయి. ఈ సంఖ్య రూ.8.82 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో రిటైల్ అడ్వాన్స్ 20.8% పెరిగి రూ.2.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
అదానీ విల్మార్: ప్రతి విభాగంలో మెరుగైన మార్కెటింగ్ కారణంగా కంపెనీ వాల్యూమ్ వృద్ధి 13%గా ఉంది. బ్రాండెడ్ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 36% పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆహారం, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో 23% వృద్ధిని కంపెనీ నమోదు చేసింది.
ఇండియన్ బ్యాంక్: జూన్ త్రైమాసికంలో కంపెనీ వ్యాపార వృద్ధి వార్షిక ప్రాతిపదికన 10.9% అంటే రూ.12.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 9.5% పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరుకోగా.. స్థూల అడ్వాన్సులు 12.7% పెరిగి రూ.5.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బంధన్ బ్యాంక్: రతన్ కుమార్ కేష్ జూలై 10, 2024 నుంచి 3 నెలల పాటు కంపెనీకి తాత్కాలిక MD, CEOగా నియమితులయ్యారు.
Nykaa: జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయ వృద్ధి 22%-23%గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ కాలంలో స్థూల సరుకుల విలువ వృద్ధి 20%-25% ఉండవచ్చు.