అన్వేషించండి

Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి

ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజును ఏజెన్సీ బ్యాంక్‌లు పనిదినంగా పాటించాలని, ఆదివారం అయినప్పటికీ అన్ని శాఖలను తెరవాలని ఆదేశించింది.

Banks Works on Sunday: భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో & నాలుగో శనివారం కూడా మూతబడాయి. అయితే, ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.

RBI నోటిఫికేషన్
బ్యాంక్‌ సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నెల 20న ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం... 2024 మార్చి 30, శనివారం రోజున & మార్చి 31 ఆదివారం రోజున అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేయాలని, ఆ బ్యాంక్‌ల అన్ని శాఖలు తెరిచి ఉంచాలని ఆదేశించింది. RBI నోటిఫికేషన్ వర్తించే అన్ని బ్యాంకుల శాఖలు ఈ శనివారం, ఆదివారం తెరిచే ఉంటాయి. ఈ బ్యాంక్‌ ఉద్యోగులకు ఈ వారాంతంలో సెలవులు రద్దయ్యాయి.

ఈ వారాంతంలో అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడానికి కారణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ముగింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరం ‍(2024-25‌) 01 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31) ఆదివారం నాడు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగే అన్ని ప్రభుత్వ లావాదేవీలను ఈ ఆర్థిక సంవత్సరం ఖాతాల్లో నమోదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. ఈ కారణంగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజును ఏజెన్సీ బ్యాంక్‌లు పనిదినంగా పాటించాలని, ఆదివారం అయినప్పటికీ అన్ని శాఖలను తెరవాలని ఆదేశించింది.

లిస్ట్‌లో 33 బ్యాంక్‌లు
ఏజెన్సీ బ్యాంకులు అంటే ప్రభుత్వ లావాదేవీలను సెటిల్‌ చేసేందుకు అధికారం ఉన్న బ్యాంకులు. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులు సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. అవి.. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు

1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2. బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
4. కెనరా బ్యాంక్
5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6. ఇండియన్ బ్యాంక్
7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
9. పంజాబ్ నేషనల్ బ్యాంక్
10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11. UCO బ్యాంక్
12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రైవేట్ రంగ బ్యాంకులు

13. యాక్సిస్ బ్యాంక్
14. సిటీ యూనియన్ బ్యాంక్
15. DCB బ్యాంక్
16. ఫెడరల్ బ్యాంక్
17. HDFC బ్యాంక్ 
18. ICICI బ్యాంక్ 
19. IDBI బ్యాంక్ 
20. IDFC ఫస్ట్‌ బ్యాంక్
21. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 
22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 
23. కర్ణాటక బ్యాంక్ 
24. కరూర్ వైశ్యా బ్యాంక్ 
25. కోటక్ మహీంద్ర బ్యాంక్ 
26. RBL బ్యాంక్ 
27. సౌత్ ఇండియన్ బ్యాంక్ 
28. యెస్ బ్యాంక్ 
29. ధనలక్ష్మి బ్యాంక్ 
30. బంధన్ బ్యాంక్ 
31. CSB బ్యాంక్ 
32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 

విదేశీ బ్యాంకులు

33. DBS బ్యాంక్ ఇండియా 

రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపడిన సెంట్రల్ బ్యాంక్ కార్యాలయాలు కూడా శని & ఆదివారాలు తెరిచి ఉంటాయి.

ఆదివారం నాడు బ్యాంకుల్లో అందే సేవలు
నోటిఫికేషన్‌లో RBI సూచించిన ప్రకారం...  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజులూ బ్యాంకులు ఎప్పటిలాగే పని చేస్తాయి, సాధారణ సమయాల ప్రకారమే తెరిచి ఉంటాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

మరో ఆసక్తికర కథనం: రిలయన్స్ షేర్లు రూ.4,442 వరకు వెళ్లొచ్చు!, లెక్కలేసిన గ్లోబల్‌ బ్రోకరేజ్‌

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget