Ajanta Pharma: ₹315 కోట్ల బైబ్యాక్ ప్రకటించిన అజంత ఫార్మా, ఈ రేటు బెటరేనా?
రూ. 315 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ఈ కంపెనీ ప్రకటించింది.
Ajanta Pharma Shares Buyback: మార్కెట్ ఎదురు చూస్తున్న వార్తను అజంత ఫార్మా వెల్లడించింది. మొత్తం రూ. 315 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ఈ కంపెనీ ప్రకటించింది.
టెండర్ ఆఫర్ రూట్‌లో అజంత ఫార్మా బైబ్యాక్ ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 1,425 ధరను కంపెనీ ప్రకటించింది. మొత్తం ఈక్విటీలో 2.59% కు సమానమైన 22,10,500 ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొంటుంది.
తొలుత తగ్గి, తర్వాత పుంజుకున్న షేర్
బైబ్యాక్ ప్రకటన తర్వాత, ఇవాళ (శుక్రవారం, 10 మార్చి 2023) మధ్యాహ్నం 2.45 గంటల సమయానికి అజంత ఫార్మా షేర్ రూ. 11.60 లేదా 0.90% తగ్గి, రూ. 1,216 వద్ద ట్రేడవుతోంది. తొలుత తగ్గిన షేర్ ప్రైస్, ఆ తర్వాత రికవరీలో ఉంది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం... ఈ స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,471. ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 21% ర్యాలీని ఈ టార్గెట్ ప్రైస్ సూచిస్తోంది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD), అజంత ఫార్మా షేర్లు 0.7% మేర, అతి స్వల్పంగా లాభపడ్డాయి. గత ఒక సంవత్సరం కాలంలో కేవలం 4% వరకు రాణించాయి. గత 6 నెలల కాలంలో 12% పైగా నష్టపోయాయి.
"మార్చి 31, 2022 నాటికి కంపెనీకి చెందిన మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్యలో 2.59%కి సమానమైన, ఒక్కొక్కటి రూ. 2 ముఖ విలువ కలిగిన 22,10,500 ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయడానికి ఈరోజు జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ. 1,425 చొప్పున మొత్తం రూ. 315 కోట్లకు మించకుండా నగదు రూపంలో చెల్లించడానికి అంగీకరించింది" అని కంపెనీ ఒక ఫైలింగ్‌లో పేర్కొంది.
సెబీ రూల్ ప్రకారం... మార్చి 2022 నాటి కంపెనీ ఆర్థిక నివేదికల్లోని ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్, నగదు నిల్వల్లో 10% పరిమితికి మించి బైబ్యాక్ పరిమాణం ఉండకూడదు.
"టెండర్ ఆఫర్ రూట్ ద్వారా, దామాషా ప్రాతిపదికన షేర్ల బైబ్యాక్ మొత్తం చెల్లింపు రూ. 389 కోట్లకు మించదు (ఈక్విటీ షేర్ల బైబ్యాక్ కోసం రూ. 315 కోట్లు + బైబ్యాక్ పన్ను రూ. 74 కోట్లు)" అని కంపెనీ వెల్లడించింంది.
అజంత ఫార్మా ఒక స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ. దీనికి, భారతదేశం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్రాండెడ్ జెనరిక్ వ్యాపారం ఉంది. USలో జెనరిక్ బిజినెస్, ఆఫ్రికాలోని ఇన్‌స్టిట్యూషన్ బిజినెస్ ఉంది. ఈ కంపెనీకి చెందిన చాలా ఉత్పత్తులు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి, ఉప చికిత్స విభాగాల్లో అగ్రగాములుగా నిలిచాయి. అజంత ఫార్మాకు ముంబైలో అత్యాధునిక R&D కేంద్రం ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.