By: ABP Desam | Updated at : 25 Jan 2023 02:10 PM (IST)
Edited By: Arunmali
ఎయిర్‌టెల్ ఖాతాదార్లకు షాక్
Airtel Tariff Hike: కోట్లాది మంది సామాన్య ప్రీ పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) షాక్ ఇచ్చింది. మొబైల్ టారిఫ్ పెంచుతూ ఈ టెలికాం కంపెనీ నిర్ణయం తీసుకుంది. అది కూడా చిన్న మొత్తం కాదు, ఏకంగా 57 శాతం ధర ఒక్కసారే పెంచేసింది.
మొన్నటి వరకు ఎయిర్‌టెల్ మినిమమ్ ప్రీ పెయిడ్ ప్లాన్‌గా ఉన్న రూ. 99 ప్లాన్‌ను కంపెనీ రద్దు చేసింది. దాని స్థానంలో ఇప్పుడు రూ. 155 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అంటే, ఇప్పుడు మినిమమ్ ప్లాన్ కోసం రీఛార్జ్ చేసుకోవాలంటే వినియోగదారులు రూ. 99 కి బదులు రూ.155 చెల్లించాలి. ఏడు సర్కిళ్లలో కనీస నెలవారీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
రూ.155 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్
అయితే రూ. 99 ప్లాన్ కంటే రూ. 155 ప్లాన్‌లో కొన్ని సౌకర్యాలు పెంచింది. ఎయిర్‌టెల్ ఈ పాత రూ. 99 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు పరిమిత టాక్ టైమ్ మాత్రమే పొందుతారు. ఆ కాల్ పరిమితి తర్వాత ఇక ఆ సిమ్ నుంచి ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లవు. పరిమిత కాల్స్‌ను ప్లాన్ ధరతో పోలిస్తే.. ఒక్కో సెకన్ కాలింగ్ 2.5 పైసలు ఖర్చయ్యేది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ 28 రోజులకు కలిపి కేవలం 200 MB మొబైల్ డేటా అందించింది.
కానీ, రూ. 155 కొత్త రీ ఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. దీని చెల్లుబాటు వ్యవధి కూడా 28 రోజులు. ఈ ప్లాన్‌తో రీ ఛార్జ్ చేసుకుంటే, 28 రోజుల చెల్లుబాటు వ్యవధిలో ఆ సిమ్ నుంచి ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. దీంతో పాటు.. ఒక GB (1 GB) ఇంటర్నెట్ డేటా & 300 SMSల సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు హలో ట్యూన్, వింక్ మ్యూజిక్ సేవలు ఉచితంగా అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సహా 7 సర్కిళ్లలో..
గత ఏడాది నవంబర్‌లోనే రూ. 99 కనీస నెలవారీ ప్రీ పెయిడ్ రీ ఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసిన కంపెనీ, మొదట హరియాణా, ఒడిశాలో రూ. 155 ప్లాన్‌ను లాంచ్ చేసింది. అక్కడి ప్రజల స్పందన చూసి ఓకే అనుకున్నాక, ఇప్పుడు ఈ మరో ఏడు సర్కిళ్లలో విడుదల చేసింది. ఆ ఏడు సర్కిళ్లు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు.
ఎయిర్‌టెల్ వెల్లడించిన ప్రకారం... కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మీటర్ టారిఫ్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అందుకోసమే రూ. 99 స్థానంలో రూ. 155 కొత్త ఎంట్రీ లెవల్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. సబ్‌స్ర్కైబర్లు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ ప్లాన్‌ని ఉపయోగించగలరని, ఈ ప్లాన్ మరింత అనువైనది, మరింత విలువైనది నమ్ముతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే, రూ. 155 ప్లాన్ కింద రీ ఛార్జ్ చేసుకోవాలని చూసిన వాళ్లకు, కొన్ని ప్రి పెయిడ్ ఫోన్ నంబర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, మరికొన్ని ఫోన్ నంబర్లకు 24 రోజుల వ్యాలిడిటీ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. దీంతో.. ఖాతాదార్లు అయోమయానికి గురవుతున్నారు.
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు