అన్వేషించండి

Diwali Airfares: దీపావళి డిస్కౌంట్‌ - భారీగా తగ్గిన విమాన ఛార్జీలు, త్వరగా టిక్కెట్‌ బుక్‌ చేసుకోండి!

Diwali 2024 Discounts: దిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ సహా కొన్ని నగరాల మధ్య విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే భారీగా తగ్గాయి.

Airfares Are Came Down This Year Around Diwali: ప్రతి సంవత్సరం దసరా (Dasara 2024), దీపావళి (Diwali 2024) పండుగల సీజన్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడతాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఛార్జీలు పెరుగుతాయి. ముఖ్యంగా, ఫ్లైట్‌ టిక్కెట్‌ రేట్లు పెరుగుతాయి. ఫెస్టివ్‌ సీజన్‌లో, తరచుగా, ప్రజలు సాధారణం కంటే రెట్టింపు ఛార్జీలతో విమానాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. కానీ, ఈ సంవత్సరం దీపావళి సీజన్‌లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. విమాన చార్జీలు భారీగా తగ్గాయి. దీనిని, విమాన ప్రయాణికులందరికీ దీపావళి కానుకగా చెప్పుకోవచ్చు. చమురు ధరల తగ్గుదల నుంచి ఫ్లైట్‌ పాసెంజర్లు ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాదు, విమానయాన సంస్థల సామర్థ్యం పెరుగుదల, సర్వీసుల సంఖ్య పెరగడం కూడా ఎయిర్‌ ట్రావెలర్స్‌కు కలిసొచ్చింది. 2023లో దీపావళి సీజన్‌ కోసం నవంబర్‌ 10-16 తేదీలను లెక్కలోకి తీసుకుంటే, ఈ ఏడాది పండుగ తేదీలు మారాయి కాబట్టి అక్టోబర్‌ 28 - నవంబర్‌ 03ను దీపావళి సీజన్‌గా ఎంచుకున్నారు.

దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో (Ixigo) రిపోర్ట్‌ ప్రకారం... దేశంలోని వివిధ మార్గాల్లో విమాన ఛార్జీలు 20 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గాయి. వన్-వే జర్నీల విషయంలో ఛార్జీల్లో డిస్కౌంట్‌ లభించింది. ఒక నెల క్రితం చేసిన బుకింగ్స్‌ ఆధారంగా, ఇక్సిగో ఈ నివేదికను సిద్ధం చేసింది. నివేదిక ప్రకారం, బెంగళూరు - కోల్‌కతా మార్గంలో గరిష్ట ఛార్జీలు తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ధర రూ. 10,195. ఈ ఏడాది కేవలం రూ. 6,319 కే ప్రయాణించవచ్చు.  ఈ రెండు నగరాల మధ్య విమాన ధరలు గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 38 శాతం తగ్గాయి. 

పెద్ద నగరాల మధ్య 30% పైగా తగ్గింపు
చెన్నై - కోల్‌కతా వెళ్లే మార్గంలో విమాన ఛార్జీలు దాదాపు 36 శాతం తగ్గాయి. గత ఏడాది రూ. 8,725 గా ఉన్న ఎయిర్‌ ఫేర్‌ ఈ ఏడాది రూ. 5,604 మాత్రమే ఖర్చవుతోంది. ముంబై - దిల్లీ మధ్య ఛార్జీలు కూడా దాదాపు 34 శాతం తగ్గాయి. గతేడాది ఈ రెండు నగరాల మధ్య విమాన ఛార్జీ రూ. 8,788 ఉండగా, ప్రస్తుతం రూ. 5,762 గా ఉంది. దిల్లీ - ఉదయ్‌పూర్ మధ్య విమాన టిక్కెట్‌ రేటు గతేడాది నాటి రూ. 11,296 నుంచి ఇప్పుడు రూ. 7,469 కి తగ్గింది. గత దీపావళి సీజన్‌తో పోలిస్తే ఈసారి దాదాపు 34 శాతం క్షీణత నమోదైంది. దిల్లీ - కోల్‌కతా, హైదరాబాద్ - దిల్లీ, దిల్లీ - శ్రీనగర్ రూట్లలోనూ ఛార్జీలు దాదాపు 32 శాతం తగ్గాయి.

ఇక్సిగో గ్రూప్ CEO అలోక్ బాజ్‌పాయ్ చెప్పిన ప్రకారం... గత ఏడాది ఇదే సమయంలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌ నిలిచిపోయాయి. అంతేకాదు, విమాన చమురు (ATF) ధరలు కూడా గతేడాది కంటే ఇప్పుడు దాదాపు 15 శాతం తక్కువగా ఉన్నాయి. అందువల్లే చాలా దేశీయ రూట్లలో విమాన టిక్కెట్‌ రేట్లు తగ్గాయి.

కొన్ని మార్గాల్లో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
అయితే, ఛార్జీలు పెరిగిన ఆకాశ మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో... అహ్మదాబాద్-దిల్లీ రూట్‌లో 34 శాతం ఛార్జీలు పెరిగాయి. గతేడాది ఈ మార్గంలో టికెట్ కోసం రూ. 6,533 వెచ్చించగా, ఈసారి రూ. 8,758 చెల్లించాల్సి వచ్చింది. ముంబై-డెహ్రాడూన్ మార్గంలో రూ. 11,710 నుంచి రూ. 15,527కి ఎయిర్‌ ఫేర్‌ పెరిగింది. ఇది దాదాపు 33 శాతం జంప్‌.

మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget